Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
Minister Ponnam Prabhakar | హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC elections) నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అభిప్రాయ సేకరణ చేపట్టారు.
Minister Ponnam Prabhakar | త్రినేత్ర.న్యూస్ : హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (Graduate MLC elections) నేపథ్యంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అభిప్రాయ సేకరణ చేపట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ ముఖ్య నాయకుల నుంచి లిఖితపూర్వకంగా అభిప్రాయాలను సేకరించేలా చర్యలు చేపట్టారు.
పార్టీ బలోపేతానికి, సమర్థవంతమైన అభ్యర్థి ఎంపికకు స్థానిక నాయకుల అభిప్రాయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన సూచనలు, అభిప్రాయాలను సమగ్రంగా పరిశీలించి పార్టీ అధిష్ఠానానికి నివేదిస్తామని చెప్పారు. అదే విధంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ ఇన్‌ఛార్జిలు పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని పార్టీ నాయకులు సమన్వయంతో విజయవంతం చేయాలని, ప్రతి నియోజకవర్గంలో లక్ష్యాలకు అనుగుణంగా నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Also Read..
విమాన ప్రయాణీకుల భద్రతకు ఏం చర్యలు తీసుకుంటున్నారు..? కేంద్రాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎంపీ
పెట్టుబడిదారులకు అలర్ట్.. బంగారం కొనేందుకు సరైన సమయమా..?
తెలుగు సినిమాలో జయం రవి - వెంకటేశ్వర స్వామిగా కోలీవుడ్ హీరో
తాజావార్తలు
- ●Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్లో నయనతార రెండు సినిమాలు రిలీజ్
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!

Nayanthara | తన సినిమాతో తానే పోటీ - రెండు రోజుల గ్యాప్లో నయనతార రెండు సినిమాలు రిలీజ్

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్



