DMK | మోదీ సర్కార్‌కు బూస్ట్.. డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు.. యూటర్న్ వెనుక అసలు కారణమిదే..!
DMK | ఎన్డీయే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు తమిళనాడులోని డీఎంకే (DMK) పూర్తి మద్దతు ప్రకటించింది. ఇవాళ ఉదయం జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ బిల్లుకు మద్దతివ్వాలని డీఎంకే ఎంపీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
DMK | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీ వేదికగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కేవలం ఏడు నెలల వ్యవధిలోనే పార్లమెంట్‌లో అధికార ఎన్డీయేకి (DMK) బలం భారీగా పెరిగింది. ఎన్డీయే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) బిల్లుకు మద్దతు కూడగట్టడంలో మోదీ సర్కార్ విజయం సాధించింది. ఈ బిల్లును గత సెషన్‌లో వ్యతిరేకించిన పార్టీలు సైతం ఇప్పుడు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలోని శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ డీలిమిటేషన్‌కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా తమిళనాడులోని డీఎంకే సైతం ఈ బిల్లుకు బహిరంగ మద్దతు ప్రకటించింది.
ఇవాళ ఉదయం జరిగిన పార్టీ ఎంపీల సమావేశంలో ఈ బిల్లుకు మద్దతివ్వాలని డీఎంకే ఎంపీలు ఏకగ్రీవ తీర్మానం చేశారు. సమావేశం అనంతరం పార్టీ సీనియర్ ఎంపీలు ఎ. రాజా, దయానిధి మారన్ మీడియాతో మాట్లాడుతూ.. సభలో కొత్త డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. గతంలో జనాభా ప్రాతిపదికన జరిగే డీలిమిటేషన్‌ను డీఎంకే తీవ్రంగా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే, దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను తొలగిస్తూ ఈ బిల్లుకు కేంద్రం కీలక సవరణ చేసింది. తాజా జనాభా లెక్కల ఆధారంగా కాకుండా, ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యను అన్ని రాష్ట్రాల్లోనూ 50 శాతం మేర పెంచాలని ప్రతిపాదించింది. అంతేకాదు, రాష్ట్రాల మధ్య ఉన్న ప్రస్తుత సీట్ల నిష్పత్తిని (pro-rata share) మరో 25 ఏళ్ల పాటూ అంటే 2051 వరకూ యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
బీజేపీకి బూస్ట్..
కేంద్ర ప్రభుత్వ తాజా సవరణలతో ఏకీభవించిన ప్రతిపక్షాలు ఈ బిల్లుకు మద్దతు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. 22 మంది ఎంపీలున్న డీఎంకే ఈ బిల్లుకు మద్దతు ప్రకటించడం అధికార పక్షానికి పెద్ద ఊరటనిచ్చే అంశం. ముఖ్యంగా ఏప్రిల్‌లో వీగిపోయిన ఈ బిల్లును ఎలాగైనా గెలిపించి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్న మోదీ సర్కార్‌కు డీఎంకే మద్దతుతో బలం చేకూరనుంది. పునర్విభజన తర్వాత పార్లమెంటులో తమిళనాడు సీట్ల సంఖ్య ప్రస్తుతమున్న 39 నుంచి 59కి పెరగనుంది. దీనివల్ల సభలో తమిళనాడు ప్రాతినిధ్య వాటా (7.2%) ఏమాత్రం తగ్గకుండా యథాతథంగా కొనసాగుతుండటంతో డీఎంకే సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ప్రతిపాదనలకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది.
డీలిమిటేషన్‌పై డీఎంకే డిమాండ్ ఇదే..
డీలిమిటేషన్‌పై తమ పార్టీ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ శుక్రవారమే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జనాభా ఆధారిత పునర్విభజన వల్ల కలిగే నష్టాలను తాను ముందుగానే గుర్తించి, చెన్నైలో ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్యను పెంచినట్లయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ లోక్‌సభలో తమిళనాడుకు ప్రస్తుతం ఉన్న 7.18 శాతం సీట్ల వాటా తగ్గకూడదని, 1971 జనాభా లెక్కల (1971 Census) ఆధారంగా గతంలో స్థిరీకరించిన రాష్ట్రాల మధ్య ఉన్న పార్లమెంటరీ ప్రాతినిధ్య నిష్పత్తిని మరో 25 ఏళ్ల పాటూ యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ రెండు డిమాండ్ల విషయంలో డీఎంకే అస్సలు వెనక్కి తగ్గేదే లేదన్నారు. ఈ డిమాండ్లకు కేంద్రం తాజాగా ఓకే చెప్పడంతో.. డీఎంకే తన డిమాండ్‌కు కట్టుబడి డీలిమిటేషన్‌కు మద్దతు ప్రకటించింది.
కాంగ్రెస్‌తో విభేదాల వల్లేనా?
అయితే, తమిళనాడులో కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న తర్వాతే డీఎంకే తన వైఖరి మార్చుకుందంటూ ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలను డీఎంకే నేతలు తీవ్రంగా ఖండించారు. న్యాయమైన డీలిమిటేషన్ జరగాలన్నదే మొదటి నుంచీ తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. పార్లమెంటు సభ్యుల సంఖ్య పెంచడం తమకు ఇష్టం లేకపోయినా, కేంద్రం ఆ దిశగా అడుగులు వేస్తున్నప్పుడు కనీసం తమ రాష్ట్ర దామాషా వాటా దెబ్బతినకుండా చూసుకోవడమే తమ ప్రధాన ఉద్దేశమని వెల్లడించారు.
Also Read..
మోదీ కేబినెట్‌లోకి సుప్రియా సూలే..? డీలిమిటేషన్ మద్దతు ప్రతిఫలంగా ఎన్సీపీకి కీలక పదవులు..!
తాజావార్తలు
- ●Upcoming IPOs | వచ్చే వారం 5 ఐపీఓలు.. డిసెంబర్ 1 నుంచి సందడి..
- ●Affair Suspicion | మరొకరితో సంబంధం.. అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య
- ●Supriya Sule | మోదీ కేబినెట్‌లోకి సుప్రియా సూలే..? డీలిమిటేషన్ మద్దతు ప్రతిఫలంగా ఎన్సీపీకి కీలక పదవులు..!
- ●WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్డేట్ చేయండి..
- ●Karthika Deepam | కేపీహెచ్‌బీ విషాదం.. కార్తీక దీపం అంటుకుని యువతి మృతి
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. వారాంతంలో ర్యాలీ..

Upcoming IPOs | వచ్చే వారం 5 ఐపీఓలు.. డిసెంబర్ 1 నుంచి సందడి..

Affair Suspicion | మరొకరితో సంబంధం.. అనుమానంతో ప్రియురాలి దారుణ హత్య

Supriya Sule | మోదీ కేబినెట్‌లోకి సుప్రియా సూలే..? డీలిమిటేషన్ మద్దతు ప్రతిఫలంగా ఎన్సీపీకి కీలక పదవులు..!

WhatsApp Security | వాట్సాప్ యూజర్లకు సీఈఆర్టీ-ఇన్ హెచ్చరిక.. వెంటనే అప్డేట్ చేయండి..






