KTR | శాసనసభ కాదు.. కౌరవ సభ
KTR | రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అది శాసనసభ కాదు.. కౌరవ సభ. సభ కాదు.. దుశ్శాసన సభ’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం, కోర్టులపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర గవర్నర్ శివ్‌పత్రాప్ శుక్లాను కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, తమపై జరిగిన దాడులు, అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలను ఆధారాలతో వివరించారు.
- రాజ్యాంగం, కోర్టులపై సర్కారుకు గౌరవం లేదు
- హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
- సభలోకి రాకుంట అడ్డుకుంటున్నరు
- ప్రజా సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం
- అసెంబ్లీ వ్యవహారం ఘటనలో సీఎం హస్తం
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- గవర్నర్‌కు కాంగ్రెస్ సర్కారు తీరుపై ఫిర్యాదు
- జోక్యం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేసిన కేటీఆర్
KTR | రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘అది శాసనసభ కాదు.. కౌరవ సభ. సభ కాదు.. దుశ్శాసన సభ’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగం, కోర్టులపై గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు బుధవారం రాష్ట్ర గవర్నర్ శివ్‌పత్రాప్ శుక్లాను కలిశారు. రాష్ట్రంలోని తాజా పరిణామాలు, తమపై జరిగిన దాడులు, అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలను ఆధారాలతో వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ 1000 హామీలతో అధికారంలోకి వచ్చి.. 1000 రోజులుగా హామీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ ఆరోపించారు. పరిపాలనలోనూ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రైతులు, నిరుద్యోగ విద్యార్థులు, యువత, పాలిటెక్నిక్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. రాహుల్‌గాంధీ నిరుద్యోగ విద్యార్థులు, యువతను ఏ విధంగా మోసం చేశారో కూడా వివరించామన్నారు.
మహిళా ఎమ్మెల్యేలపై దాడి
శాసనసభ సమావేశాల తొలిరోజు తమపై ప్రభుత్వ ఆధ్వర్యంలో పోలీసులు చేసిన దాష్టీకాన్ని గవర్నర్‌కు వివరించామని కేటీఆర్ చెప్పారు. రాహుల్‌గాంధీ పార్లమెంట్‌లో నిరసన తెలిపిన తీరులోనే టీషర్ట్‌ల ద్వారా నిరసన తెలపాలని తాము అనుకున్నామని తెలిపారు. అయితే తమ హక్కులను కాలరాస్తూ శాసనసభ్యులమైన తమను సభలోకి రానివ్వకుండా రోడ్డుపైనే అడ్డుకున్నారని ఆరోపించారు. తమపై జరిగిన దాడికి సంబంధించిన ఫొటోలు, ఆధారాలను గవర్నర్‌కు అందించామని చెప్పారు. ముఖ్యంగా మహిళా శాసనసభ్యులపై జరిగిన దాడిని వివరించామన్నారు. తమ మహిళా నాయకురాలు సునితా లక్ష్మారెడ్డి చీరను లాగి దుశ్శాసన పర్వానికి తెరలేపిన తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తమపై దాడి చేసి.. తిరిగి తమనే బద్నాం చేస్తున్న కాంగ్రెస్ కుట్రను కూడా వివరించామన్నారు.
కేసీఆర్ చావు కోరుకునే స్థాయికి దిగజారారు..
కేసీఆర్ చావును కోరుకునే స్థాయికి కాంగ్రెస్ దిగజారిందని కేటీఆర్ ఆరోపించారు. కేసీఆర్ ఇంటిపైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గుండాల మాదిరిగా దాడి చేసేందుకు వెళ్లిన విషయాన్ని గవర్నర్‌కు తెలియజేశామన్నారు. కేసీఆర్ ఇంటిపై దాడి చేస్తూ హత్యాయత్నానికి ప్రభుత్వం ప్రయత్నించిన తీరును ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. కేసీఆర్ లాంటి మహానాయకుడి ఇంటి వద్ద చావు డప్పు కొడుతూ.. ఆయన చావును కోరిన దుర్మార్గం గురించి గవర్నర్‌కు వివరాలు అందించామని కేటీఆర్ తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక ముఖ్యమంత్రి స్వయంగా ఉన్నారని ఆరోపించారు.
రాజ్యాంగం, కోర్టులపై గౌరవం లేదు..
హైకోర్టు చెప్పినా శాసనమండలి, శాసనసభలోకి తమను రానివ్వకుండా ప్రభుత్వం అడ్డుకున్న తీరును గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని కేటీఆర్ చెప్పారు. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం, కోర్టులపై ఎలాంటి గౌరవం లేదని వివరించామన్నారు. అందుకే ఈరోజు తమను సస్పెండ్ చేశారని తెలిపారు. శాసనమండలి సభ్యులు అనని మాటలను అన్నట్లుగా ఆపాదిస్తూ.. జరగని అవమానాన్ని జరిగినట్లుగా చూపిస్తూ దళిత స్పీకర్ పేరిట రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. తమకు స్పీకర్‌పై అపారమైన గౌరవం ఉందని, కానీ కాంగ్రెస్ పార్టీనే ఆయనను ‘దళిత స్పీకర్, దళిత స్పీకర్’ అంటూ అవమానించేందుకు చూస్తున్నదని అన్నారు. *అందుకే అది శాసనసభ కాదు.. కౌరవ సభ అని అంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. అది సభ కాదు.. దుశ్శాసన సభ అని గవర్నర్‌కు తెలియజేసి మొత్తం పరిస్థితిని వివరించామన్నారు.
విచారణకు హామీ ఇచ్చారన్న కేటీఆర్
శాసనసభ వ్యవహారాలతో పాటు బయట జరిగిన ప్రతి సంఘటనపైనా, తాము చెప్పిన ప్రతి అంశంపైనా విచారణ జరిపిస్తామని గవర్నర్ హామీ ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. గవర్నర్ ఇచ్చిన హామీ మేరకు ప్రస్తుతం జరుగుతున్న దౌర్జన్యకాండలో ఆయన జోక్యం చేసుకుంటారని భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజల తరఫున న్యాయం అడిగి.. హామీలు అమలు చేయాలని కోరినందుకే తమపై దాడులు చేశారని గవర్నర్‌కు తెలియజేశామని అన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన అన్ని AI ఫొటోలు, వీడియోలపై ఇప్పటికే ఫిర్యాదు చేశామని తెలిపారు. తప్పుడు చిత్రాలు, తప్పుడు ఫిర్యాదులు ఉపయోగించే వారిపై న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తెలంగాణలో న్యాయం జరగకుంటే జాతీయ స్థాయిలో జాతీయ మహిళా కమిషన్‌ను కూడా ఆశ్రయించి ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..?
- ●Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..
- ●Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి
- ●Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?
- ●స్వచ్ఛ వాయు సర్వేక్షణ్ 2026: జాతీయ స్థాయిలో హైదరాబాద్ ర్యాంకెంత?.. నగరవాసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!
- ●Kayadu Lohar | ‘ఆ ప్రశ్న’ అడిగినప్పుడే.. సమాజం అసలు రూపం బయటపడుతుంది..! కయదు లోహర్ ఆసక్తికర పోస్ట్..!

Telangana Assembly | శాసనసభ రేవంత్ రెడ్డి రూల్ బుక్ ప్రకారం నడుస్తుందా..?

Samsung Galaxy Tab S10 Plus | గెలాక్సీ ట్యాబ్ ఎస్10 ప్లస్‌పై భారీ డిస్కౌంట్.. ధర ఎంతంటే..

Uber | ఉబర్ సంచలన నిర్ణయం.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు స్వస్తి

Ekta Ratod | టాలీవుడ్లోకి కన్నడ సోయగం ఏక్తా రాథోడ్.. తొలి సినిమాతో హిట్ కొట్టేనా..?





