త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు

BRS | శాసనసభలో వివిధ అంశాల‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు (Adjournment Motion) ఇచ్చింది. మహిళా శాసనసభ్యులపై పోలీసుల దాష్టీకం, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల బెదిరింపులు, ఎర్రవల్లిలో పోలీసుల సహాయంతో కాంగ్రెస్ ర్యాలీ, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చింది.

G

Telangana | Published On Sep 9, 2026, 10.00 am IST

BRS | మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దాష్టీకం, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతలు.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు
Advertisement

BRS | త్రినేత్ర‌.న్యూస్‌: అసెంబ్లీ స‌మావేశాల (Assembly Session) సంద‌ర్భంగా గ‌త రెండు రోజులుగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు చేయ‌నున్నారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నాం సోమాజీగూడ‌లోని లోక్‌భ‌వ‌న్‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) ఆధ్వ‌ర్యంలో ఎమ్మెల్యేల బృందం శివ ప్రతాప్ శుక్లా (Shiv Pratap Shukla)ను క‌లువ‌నుంది. ఈ సంద‌ర్భంగా స‌మావేశాల తొలి రోజు సంద‌ర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం, మహిళా ఎమ్మెల్యేలతో ప్రవర్తించిన తీరు, ఎమ్మెల్సీల అరెస్టులు, మంగ‌ళ‌వారం ఎర్రవల్లికి వెళ్తుండగా అడ్డుకోవ‌డంతోపాటు ఇటీవల జ‌రిగిన‌ దాడుల ఘటనలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

కాగా, మ‌ధ్యాహ్నం 1.45 గంటలకు లోక్‌భవన్‌కు బీఆర్‌ఎస్‌ ప్రతినిధుల బృందం వెళ్లాల్సి ఉంది. అయితే అనుకున్న టైం కంటే అరగంట ముందుగానే గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ ఇచ్చినట్లు సమాచారం. పది మంది ఎమ్మెల్యేల బృందం ఆయన్ని కలవనున్నట్లు తెలుస్తున్న‌ది.

శాసనసభలో వాయిదా తీర్మానాలు

మ‌రోవైపు అసెంబ్లీ మూడో రోజు స‌మావేశాలు మ‌రికాసేప‌ట్లో ప్రారంభం కానున్నాయి. శాసనసభలో వివిధ అంశాల‌పై బీఆర్ఎస్ వాయిదా తీర్మానాలు (Adjournment Motion) ఇచ్చింది. మహిళా శాసనసభ్యులపై పోలీసుల దాష్టీకం, కేసీఆర్‌పై కాంగ్రెస్ నేతల బెదిరింపులు, ఎర్రవల్లిలో పోలీసుల సహాయంతో కాంగ్రెస్ ర్యాలీ, రాష్ట్రంలో దిగజారుతున్న శాంతిభద్రతల అంశంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చింది. ఆయా అంశాల‌పై చ‌ర్చించాల‌ని, ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాల‌ని ప‌ట్టుప‌ట్ట‌నుంది.

ఇక‌ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల డీఏ బకాయిలపై చర్చించాలని బీజేపీ వాయిదా తీర్మానం ఇచ్చింది.

Advertisement
Advertisement