CM Revanth Reddy | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ ఇక నిరంతర ప్రక్రియ : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెలలోనే అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని సీఎం తెలిపారు.
CM Revanth Reddy |త్రినేత్ర.న్యూస్ : ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల జారీ అనేది నిరంతర ప్రక్రియ కొనసాగుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ నెలలోనే అనేక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని సీఎం తెలిపారు. పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో సీఎం పాల్గొని ప్రసంగించారు.
యువతకు ఇచ్చిన మాట ప్రకారం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను విజయవంతంగా చేపట్టాం. లీగల్ సమస్యలు, లిటిగేషన్లకు ఆస్కారం లేకుండా కొలువుల భర్తీ చేశాం. ఉద్యోగ నియామక ప్రక్రియలో పారదర్శకతను పునరుద్ధరించాం. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4తో పాటు మెగా డీఎస్సీ, వైద్యారోగ్య శాఖలో వరుసగా నియామకాలను చేపట్టాం. రికార్డు సమయంలో 67,763 పోస్టులను భర్తీ చేసి యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచామని సీఎం తెలిపారు.
విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదు..
ఈ నెలలోనే టీజీపీఎస్సీ ద్వారా ఇంజనీరింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, అటవీశాఖ, టౌన్ అండ్ కంట్రీప్లానింగ్, విద్యాశాఖలలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నాం. నోటిఫికేషన్‌ల జారీ ప్రక్రియ నిరంతరంగా జరుగుతుంది. విద్య ఒక్కటే పేదరికాన్ని రూపుమాపగలదని నేను విశ్వసిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వ విద్యలో విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టాం. కేంద్ర ప్రభుత్వం రెండు రోజుల క్రితం విడుదల చేసిన ఫెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ మంచి స్థానాన్ని పొందింది అని సీఎం తెలిపారు.
విద్యా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా పని చేస్తున్నాం..
తెలంగాణ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు నుంచి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల వరకు ప్రతి ప్రయత్నంలో విద్యా వ్యవస్థ బలోపేతం లక్ష్యంగా పని చేస్తున్నాం. రాష్ట్రంలోని 65 ఐటీఐలు, పాలిటెక్నిక్ కళాశాలలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లుగా పునర్ వ్యవస్థీకరించాం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. ఈ యూనివర్సిటీలో ఇప్పటివరకు 1,190 మంది విద్యార్థులు కోర్సులు పూర్తి చేశారు. వీరిలో 838 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించటం ఆనందంగా ఉంది. మైక్రోసాఫ్ట్, ఫ్లిప్‌కార్ట్, టెక్ మహీంద్రా, డాక్టర్ రెడ్డీస్, ఏఐజీ హాస్పిటల్స్, అపోలో హాస్పిటల్స్ వంటి ప్రముఖ సంస్థల్లో వీరికి అవకాశాలు దక్కాయని సీఎం గుర్తు చేశారు.
బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తాం
ఇప్పటికే రాష్ట్రంలోని 1362 ప్రాథమిక పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు అందుబాటులోకి తెచ్చాం. ఈ ఏడాది కొత్తగా 2769 స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ శాతం పెరుగుతుంది. ఈ ఏడాది రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ పథకాన్ని అమలు చేస్తాం. ప్రస్తుతం పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని జూనియర్ కాలేజీలకు విస్తరిస్తున్నాం. అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల అధ్వర్యంలో పాఠశాలల్లో రూ.706 కోట్ల విలువైన మౌలిక సదుపాయాల పనులు చేపట్టాం. మంచిరేవుల గ్రామంలో యంగ్ ఇండియా పోలీస్ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించామని సీఎం పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
జూన్ 2, 2026

BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
జూన్ 2, 2026

KTR | విద్రోహ శక్తుల నుంచి మన తెలంగాణను కాపాడుకుందాం.. కేటీఆర్ పిలుపు
జూన్ 2, 2026
తాజావార్తలు
- ●Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె
- ●BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల
- ●Indian truck drivers | అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్టు
- ●Kodandaram | పవన్ కళ్యాణ్ అనవసర వివాదాలకు తెరలేపుతున్నరు: కోదండరాం
- ●Pawan Kalyan | ప్రెస్ మీట్‌కైనా అనుమతిస్తారా..? పవన్ కల్యాణ్ ఆసక్తికర ట్వీట్
- ●Summer | వేసవికి నేటితో ముగింపు.. రేపటి నుంచి తెలంగాణలో వర్షాలే వర్షాలు

Telangana Formation Day | తెలంగాణ గడ్డ ఎప్పుడూ లొంగిపోదు.. హక్కుల కోసం రాజీపడదు : స్విట్జర్లాండ్ బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ గందె

BRS South Africa | ప్రతి బిడ్డా గర్వంగా చెప్పుకొనే దినం.. జూన్ 2: నాగరాజు గుర్రాల

Indian truck drivers | అమెరికాలో 30 మంది భారతీయ ట్రక్కు డ్రైవర్లు అరెస్టు

Kodandaram | పవన్ కళ్యాణ్ అనవసర వివాదాలకు తెరలేపుతున్నరు: కోదండరాం



