Bandru Shobharani | మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం తగదు.. సత్యవతి రాథోడ్‌పై బండ్రు శోభారాణి మండిపాటు
Bandru Shobharani | ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని తెలంగాణ మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి మండిపడ్డారు. మంత్రి సీతక్క (Minister Seethakka)ను సత్యవతి రాథోడ్ (Satyavati Rathod) విమర్శించడం దారుణమన్నారు.
Bandru Shobharani | ప్రభుత్వం ఏం చేసినా ప్రతిపక్షాలు బురద జల్లుతున్నాయని తెలంగాణ మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి మండిపడ్డారు. మంత్రి సీతక్క (Minister Seethakka)ను సత్యవతి రాథోడ్ (Satyavati Rathod) విమర్శించడం దారుణమన్నారు. అంగన్వాడీ టీచర్లకు సెల్‌ఫోన్లు ఇవ్వాలనేది కేంద్రం నిర్ణయం అని చెప్పారు. రూ.11,800కు సెల్ ఫోన్లు కొనాలని కేంద్రం చెబితే.. ప్రభుత్వం రూ.11,650కే కొనుగోలు చేసిందని చెప్పారు. కేంద్రం చెప్పినదానికంటే తక్కువకి కొనడం సీతక్క చేసిన తప్పా..? అని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్‌పై బండ్రు శోభారాణి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆదివాసీలు, లంబాడీలు నిజాయితీగా ఉంటారని.. కానీ సత్యవతి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. "సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళాక కరెప్టెడ్ అయ్యారు. ఆమె మంత్రిగా ఉన్నప్పటి విషయాలపై చర్చించేందుకు సిద్ధమా..?పని గట్టుకొని మంత్రి సీతక్కపై అసత్య ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ సోషల్ మీడియా ద్వారా మనుషుల వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. నక్సలైట్‌గా ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ సీతక్క నిజాయితీగానే ఉన్నారు. నేను, సీతక్క కలిసి అండర్‌గ్రౌండ్‌లో పనిచేశాం" అని బండ్రు శోభారాణి అన్నారు.
Also Read..
180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించి.. 350 అసభ్యకర వీడియోలు తీసి..
గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి






