త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Seethakka | ప్ర‌భుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి

Minister Seethakka | ఉద్యోగ‌మే ల‌క్ష్యంగా నిరుద్యోగ అభ్య‌ర్థులు క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వ కొలువు సాధించాల‌ని రాష్ట్ర మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Nov 25, 2026, 6.22 pm IST

Minister Seethakka | ప్ర‌భుత్వ ఉద్యోగమే లక్ష్యంగా అభ్యర్థులు కష్టపడాలి
Advertisement

ఉచిత శిక్షణ ముగింపు కార్యక్రమంలో
అభ్యర్థులకు పిలుపునిచ్చిన మంత్రి సీతక్క

Minister Seethakka | త్రినేత్ర న్యూస్ : ఉద్యోగ‌మే ల‌క్ష్యంగా నిరుద్యోగ అభ్య‌ర్థులు క‌ష్ట‌ప‌డి ప్ర‌భుత్వ కొలువు సాధించాల‌ని రాష్ట్ర మంత్రి సీత‌క్క పిలుపునిచ్చారు. మంత్రి సీత‌క్క‌, ములుగు జిల్లా క‌లెక్ట‌ర్ బోర్క‌డే హేమంత్ స‌హ‌దేవ‌రావు స‌హ‌కారంతో ములుగు జిల్లా పోలీసు శాఖ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన ఉచిత శిక్ష‌ణ బుధ‌వారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన ముగింపు కార్య‌క్ర‌మానికి మంత్రి సీత‌క్క‌, ఎస్పీ సుధీర్ రామ్‌నాథ్ హాజ‌ర‌య్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఈ ఉచిత శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విశ్వ అకాడమీ వారికి అభినంద‌న‌లు. అభ్యర్థులు కూడా ఇన్ని రోజులు పడిన కష్టాన్ని పరీక్షలో ఉత్తీర్ణులై చూపించాలి. ప్రిలిమ్స్ పరీక్షలో మాత్రమే కాకుండా ఉద్యోగం వచ్చే వరకు కూడా కష్టపడాలి. కష్టపడితే విజయం తప్పక వరిస్తుంది. ఈ పరీక్షలలో విజయం సాధించనంత మాత్రాన నమ్మకాన్ని కోల్పోకూడదని ఉద్యోగం వచ్చేంతవరకు కష్టపడుతూనే ఉండాలని ఒకటి కాకపోతే మరొక ఉద్యోగం వస్తుందని అభ్యర్థులను సీత‌క్క ప్రోత్సహించారు.

ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ మాట్లాడుతూ.. ఇన్ని రోజులు మీరు నేర్చుకున్న దానిని పరీక్షలలో ఉత్తీర్ణులై తమ ప్రతిభను నిరూపించుకోవాల‌న్నారు. ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాల అనంతరం కూడా తమకు తోడ్పాటు అందించాలని అభ్యర్థులు అభ్యర్థించగా జిల్లా ఎస్పీ గారు సానుకూలంగా స్పందిస్తూ మీరు ఉద్యోగం సాధించేవరకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రోత్సహిస్తూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement