Chamala Kiran Kumar Reddy | మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు.. బీజేపీ దుష్ప్రచారం చేస్తోంది : ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
Chamala Kiran Kumar Reddy | దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు (Delimitation), మహిళా రిజర్వేషన్లపై ( Women’s Reservation Bill) దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు.
Chamala Kiran Kumar Reddy | దేశ వ్యాప్తంగా నియోజకవర్గాల పెంపు (Delimitation), మహిళా రిజర్వేషన్లపై ( Women’s Reservation Bill) దేశవ్యాప్తంగా తీవ్రంగా చర్చ జరుగుతోందని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Chamala Kiran Kumar Reddy) అన్నారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకంకాదని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 2023లో మహిళా రిజర్వేషన్ల బిల్లు పెట్టినప్పుడు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల అమలుపై చర్చలో అన్ని రాజకీయ పార్టీలను భాగస్వామ్యం చేయాలన్నారు.
"డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు వుంటాయని చర్చ జరిగినప్పుడు మల్లిఖార్జున ఖర్గే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకుని పార్లమెంట్ సమావేశాలు పెట్టాలని ఖర్గే సూచించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ అయినప్పుడు 2026 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటామని కేంద్రం చెప్పింది. 543 సీట్లకు మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలాంటి అభ్యంతరం లేదు. ప్రోరేటా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఇప్పటికే నిధుల విషయంలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి. పది రోజులు ఆగితే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటి..?" అని చామల ప్రశ్నించారు.
ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదు..
ప్రోరేటా ప్రకారం 50 శాతం, రాష్ట్రాల ఆర్థిక అభివృద్ధి ఆధారంగా 50 శాతం పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. ఈ అంశంపై ఐదు రాష్ట్రాల సీఎంలకు రేవంత్ రెడ్డి లేఖలు రాసినట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 850 పార్లమెంట్ సీట్ల పెంపుదల కన్ఫ్యూజన్‌గా ఉందన్నారు. పార్లమెంటులో బలం ఉందని బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2026 జనగణనను పరిగణనలోకి తీసుకుంటారో..? లేదో..? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇవాళ మధ్యాహ్నం ఇండియా కూటమి నేతల మీటింగ్ ఉందని.. ఆ మీటింగ్ తర్వాత కూటమి అజెండా తెలుస్తుందన్నారు. డీలిమిటేషన్‌ను ఇష్టం వచ్చినట్లు చేస్తామంటే కుదరదని హెచ్చరించారు.
Also Read..
180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించి.. 350 అసభ్యకర వీడియోలు తీసి..
గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి






