Gold And Silver Prices Today | గ్లోబల్ మార్కెట్లలో పాజిటివ్ సంకేతాలు.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు..
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో మాత్రం తగ్గుదల కనిపించింది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈక్విటీ మార్కెట్లు కనిష్ట స్థాయిలో ఉండడంతో పెట్టుబడిదారులు వాటివైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.
Gold And Silver Prices Today | అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నప్పటికీ బులియన్ మార్కెట్‌లో మాత్రం తగ్గుదల కనిపించింది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ఈక్విటీ మార్కెట్లు కనిష్ట స్థాయిలో ఉండడంతో పెట్టుబడిదారులు వాటివైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. అందుకనే బులియన్ మార్కెట్‌పై ఆసక్తి చూపించలేదు. కాగా గ్లోబల్ మార్కెట్లలో ఔన్స్ బంగారం ధర 24 డాలర్లు తగ్గి 4,817 వద్ద ఉండగా, వెండి ధర 0.09 డాలర్లు తగ్గి 79 వద్ద కొనసాగుతోంది. దేశీయ కమోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 218 పాయింట్లు (0.17 శాతం) పతనమై 1,54,554 వద్ద ఉండగా, సిల్వర్ ఫ్యూచర్స్ కాంట్రాక్టు 35 పాయింట్లు (0.01 శాతం) తగ్గి 2,52,715 వద్ద ఉంది. దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.
స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు..
24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,535 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,24,280 గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,55,350 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధర రూ.15,53,500 గా ఉంది. ఇది కిందటి రోజు ముగింపుతో పోలిస్తే రూ.14,200 పెరిగింది.
22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,240 ఉండగా, 8 గ్రాముల ధర రూ.1,13,920గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,42,400 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.14,24,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.13,000 పెరిగింది.
18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.11,651 ఉండగా, 8 గ్రాముల ధర రూ.93,208గా ఉంది. 10 గ్రాముల ధర రూ.1,16,510 ఉండగా, 100 గ్రాముల బంగారం ధర రూ.11,65,100గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.10,600 పెరిగింది.
దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధర రూ.2,70,000 ఉండగా, తులం ధర రూ.2,700గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.15వేల మేర పెరిగింది. అలాగే హైదరాబాద్‌లో 1 కిలో వెండి ధర రూ.2,75,000 ఉండగా, తులం ధర రూ.2,750 గా ఉంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Gold And Silver Prices Today | ఒక్క రోజులోనే రూ.11వేలు తగ్గిన బంగారం ధర.. అమెరికా బాండ్ ఈల్డ్స్ ఎఫెక్ట్..
అక్టోబర్ 3, 2026

Harish Rao | ఒక సామాజిక సమస్యకు కేసీఆర్ చూపిన శాశ్వత పరిష్కారమే.. కల్యాణ లక్ష్మీ: హరీశ్ రావు
అక్టోబర్ 2, 2026

Gold And Silver Prices Today | పసిడికి మళ్లీ పెరుగుతున్న డిమాండ్.. ఒక్క రోజులోనే రూ.10వేలు జంప్..
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి



