Minor Girls | 180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించి.. 350 అసభ్యకర వీడియోలు తీసి..
Minor Girls | హత్యలు, లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా 100 మందికిపైగా మైనర్ బాలికలను (Minor Girls) లైంగింకంగా వేధించిన ఓ యువకుడిని మహారాష్ట్ర (Maharashtra) పోలీసులు అరెస్ట్ చేశారు.
Minor Girls | హత్యలు, లైంగిక దాడులు, హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా 100 మందికిపైగా మైనర్ బాలికలను (Minor Girls) లైంగింకంగా వేధించిన ఓ యువకుడిని మహారాష్ట్ర (Maharashtra) పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు అమరావతి (Amravati) జిల్లా పరట్వాడాకు (Paratwada) చెందిన మొహమ్మద్ అయాజ్ (Mohammad Ayaz) అలియాస్ తన్వీర్‌గా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అతడు సుమారు 180 మంది మైనర్ బాలికలను లైంగికంగా వేధించాడు. వారితో 350 అసభ్యకర వీడియోలను కూడా చిత్రీకరించాడు. తొలుత ప్రేమ పేరుతో అమ్మాయిలను ట్రాప్ చేసి వారిని ముంబై, పూణెకి తీసుకెళ్లి అశ్లీల వీడియోలు తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ వీడియోలను చూపించి బాలికలను బ్లాక్‌మెయిల్ చేసేవాడని తెలిసింది. అంతేకాదు, వారిని బలవంతంగా వ్యభిచారంలోకి కూడా దించేవాడు.
బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ అనిల్ బోండే (Rajya Sabha MP Anil Bonde) ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువకుడిపై చర్యలు తీసుకున్నారు. వాట్సాప్, స్నాప్‌చాట్ గ్రూపుల ద్వారా మైనర్లను అతను టార్గెట్ చేసినట్లు ఎంపీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. లేదంటే ఎస్పీ ఆఫీసు ముందు ధర్నా చేపడతామని ఎంపీ వార్నింగ్ ఇచ్చారు. ముస్లిం కమ్మూనిటీకి చెందిన కొందరు సభ్యులు కూడా పోలీసు స్టేషన్‌కు వెళ్లి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కాగా, నిందితుడు ఎంఐఎం పార్టీ ఆఫీస్‌లో బాయ్‌గా పనిచేశాడు. పార్టీ కార్యక్రమాలకు చెందిన కొన్ని ఫొటోలు, వీడియోలను నిందితుడు తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఎంఐఎం అమరావతి అధ్యక్షుడు హజి ఇర్ఫాన్ ఖాన్ నుంచి అతను ఓ లేఖను అందుకుంటున్న ఫొటో కూడా ఉంది. ర్యాలీలకు చెందిన వీడియోలు కూడా ఉన్నాయి. అయితే, ఈ కేసు నమోదైన నేపథ్యంలో అతని సోషల్ మీడియా ఖాతాల నుంచి ఎంఐఎం పార్టీకి చెందిన ఫొటోలు, వీడియోలను తొలగించారు.
ఇక ఈ కేసులో పోలీసులు అయాజ్‌ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడికి ఏడు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. పోలీసులు అతని మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. అందులో అనేక అభ్యంతరకరమైన వీడియోలు ఉన్నట్లు సమాచారం. ఆ వీడియోలను నిందితుడు తన స్నేహితులకు లేదా ఇతర క్రిమినల్ ముఠాలకు షేర్ చేశాడా అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు, సైబర్ సెల్ సాయంతో సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల గురించి కూడా ఆరా తీస్తున్నారు.
Also Read..
బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణం.. ఆ పదవి చేపట్టిన తొలి నేతగా రికార్డు
సంబంధిత వార్తలు

Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
అక్టోబర్ 2, 2026

PM Modi | ప్రధాని ఫ్రెండ్‌కు భారీ ఊరట.. మోదీని కలిసిన వెంటనే వివాదాస్పద భూమిపై వెనక్కితగ్గిన ఎమ్మెల్యే
సెప్టెంబర్ 16, 2026

Dusha Salian Murdered Case | దిశా శాలియన్ మృతి కేసులో బిగ్ ట్విస్ట్.. ఎఫ్ఐఆర్లో మాజీ సీఎం కొడుకు, నటుల పేర్లు
సెప్టెంబర్ 14, 2026
తాజావార్తలు
- ●Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ
- ●Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు
- ●Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం
- ●Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి
- ●Mahesh Kumar Goud | తెలంగాణకు బీసీయే గ్యారంటీగా ముఖ్యమంత్రి అవుతాడు
- ●Delhi AAP Protest | ఢిల్లీలో ఆప్ రణరంగం: సీఈసీకి వ్యతిరేకంగా భగ్గుమన్న కార్యకర్తలు

Asaduddin Owaisi Jail Allegations | చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు అవాస్తవం: స్పష్టతనిచ్చిన తెలంగాణ జైళ్ల శాఖ

Congress Govt | ఉత్తుత్తి కమిటీలేనా? 33 నెలల్లో45 కమిటీలు

Harish Rao | సిద్దిపేట జిల్లాకు పదేళ్లు.. కీర్తి ఎల్లలు దాటేలా వేడుకలు చేద్దాం

Ponnam Prabhakar | దేశ వ్యాప్తంగా కులగణన జరగాలి



