Bhatti Vikramarka | మహాలక్ష్మి పథకంతో మహిళలకు రూ.9,222 కోట్లు ఆదా : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన తొలి వాగ్దానం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 ను (Telangana Budget 2026-27) ఆయన ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
Bhatti Vikramarka | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన తొలి వాగ్దానం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2026-27 ను (Telangana Budget 2026-27) ఆయన ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి పథకం (Mahalakshmi scheme) ద్వారా తమ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తోందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతిరోజూ రాష్ట్రంలోని 34 లక్షల 37 వేల మంది ఆడ బిడ్డలు ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకూ ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలు 269 కోట్ల 68 లక్షల ఉచిత ప్రయాణాలు చేసి.. దాదాపు రూ.9,222 కోట్లు ఆదా చేసుకున్నారని వివరించారు.
రూ.500కే సిలిండర్‌తో.. మహిళలకు రూ.752 కోట్లు ఆదా
అదేవిధంగా వంట గ్యాస్ సిలిండర్ భారం నుంచి మహిళలకు ఉపశమనం కల్పించేందుకు నెలకు రూ.500కే వంటగ్యాస్ సిలిండర్ అందించే పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఈ పథకం కింద రాష్ట్రంలోని 42,90,000 కుటుంబాలకు లబ్ధి చేకూరినట్లు చెప్పారు. ఈ పథకం ద్వారా మహిళలకు సుమారు రూ.752 కోట్లు ఆదా అయినట్లు వివరించారు.
గృహజ్యోతి పథకం (Gruha Jyothi Scheme) ద్వారా సుమారు 53 లక్షల 9 వేల పేద, మధ్య తరగతి కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచిత కరెంట్ అందిస్తున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకం కింద ఇప్పటి వరకూ 10 కోట్ల 97 లక్షల రూపాయల సున్నా బిల్లులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ సబ్సిడీ కింద 3 వేల 900 కోట్ల 54 లక్షల రూపాయలను విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం చెల్లించినట్లు వెల్లడించారు. చేయూత పథకానికి అర్హులైన వారికి 2 లక్షల నూతన పెన్షన్లను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు.
Also Read..
BRS | ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలంటూ గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ నిరసన
స్కూల్ విద్యార్థులకు పాలు, రాగిజావ.. ఇంటర్ విద్యార్థులకు ఆహారం
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?






