Telangana Budget | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు నగదు రహిత ఆరోగ్య భద్రత: భట్టి
Cashless Health Security | కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత (Cashless Health Security) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీ(Assembly) లో ప్రకటించారు. ఇది తాము కల్పించే భద్రత, భరోసా అని చెప్పారు.
త్రినేత్ర.న్యూస్: Cashless Health Security కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న నగదు రహిత ఆరోగ్య భద్రత (Cashless Health Security) పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అసెంబ్లీ(Assembly) లో ప్రకటించారు. ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులందరికీ వర్తిస్తుందని వెల్లడించారు. ఇది తాము కల్పించే భద్రత, భరోసా అని చెప్పారు.
నగదు రహిత ఆరోగ్య భద్రత...
ఈ పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు ద్వారా అమలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రయివేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు ఈ పథకంలో చికిత్స పొందొచ్చని తెలిపారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డును కూడా అందిస్తామని పేర్కొన్నారు. దాదాపు 23 లక్షల 51 వేల మంది ఉద్యోగస్తులు, పెన్షనర్లు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారని వివరించారు.
సమగ్ర ప్రమాద బీమా పథకం..
ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేళపెట్టినట్లు భట్టి పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. కోటీ ఇరవై లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు. 60 ఏండ్ల వరకు 10 లక్షల రూపాయల టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్, విమాన ప్రమాదంలో మరణిస్తే రూ.2 కోట్ల అదనపు కవరేజీ లభించేలా ఈ పథకాన్ని రూపొందించినట్లు స్పష్టం చేశారు. ఇది 7 లక్షల 57 వేల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తించనున్నట్లు వెల్లడించారు.
సంబంధిత వార్తలు

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
సెప్టెంబర్ 23, 2026

Open Top Double Decker Buses | హైదరాబాద్ రోడ్లపైకి ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సులు
సెప్టెంబర్ 22, 2026

CM Revanth Reddy | నీళ్లు నిలిచినా.. వాహనాలు ఆగినా.. మీ ఉద్యోగాలుండవ్..
సెప్టెంబర్ 22, 2026
తాజావార్తలు
- ●MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?
- ●Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం
- ●Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
- ●84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?
- ●Horoscope | సెప్టెంబర్ 23 రాశిఫలాలు.. ఈ రాశివారు కుటుంబ సభ్యుల ద్వారా లాభాలు పొందుతారు!
- ●Mark Wood | వరుస గాయాలు.. మార్క్‌వుడ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు!

MMTS Trains | ఈ నెల 25 నుంచి 27 వరకు రాత్రంతా అందుబాటులో ఎంఎంటీఎస్ రైళ్లు.. ఎందుకంటే?

Saparya | అనాథలు, వృద్ధులకు అండగా సపర్య.. బృహత్తర కార్యక్రమానికి నటుడు కాదాంబరి కిరణ్ శ్రీకారం

Heavy Rain Alert | నేడు, రేపు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్

84 ఏళ్లుగా అమెరికా ఒక్క ‘యుద్ధం’ చేయలేదట.. మరి ఇవన్నీ ఏంటి?



