త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఉపాధి హామీ కూలీ కుటుంబానికి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలి : సీపీఐ నారాయ‌ణ‌

CPI Narayana | ఉపాధి హామీ కూలీ కుటుంబాన్ని ఆదుకునేలా ప్ర‌మాద బీమా ప‌థ‌కాన్ని (insurance scheme) అమ‌లు చేయాల‌ని సీపీఐ నారాయ‌ణ (CPI Narayana) డిమాండ్ చేశారు.

D

Telangana | Published On Apr 21, 2026, 5.40 pm IST

ఉపాధి హామీ కూలీ కుటుంబానికి ప్రమాద బీమా పథకాన్ని అమలు చేయాలి : సీపీఐ నారాయ‌ణ‌
Advertisement

మ‌హాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం (MGNREGA)లో చాలా లొసుగులున్నాయ‌ని సీపీఐ నారాయ‌ణ అన్నారు. వాటిని స‌వ‌రించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. గ‌తంలో ప‌నిచేసేందుకు కూలీల‌కు ప‌నిముట్లు అంద‌జేసేవార‌ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఇప్పుడు త‌మ ప‌నిముట్లు తామే తీసుకురావాల‌ని అధికారులు వేధిస్తున్నార‌ని కూలీలు వాపోతున్న‌ట్లు చెప్పారు.

ఉద‌యం రాగానే ఐరిస్ పేరిట ఒక‌సారి, మ‌ళ్లీ మ‌ధ్యాహ్నం ఫొటోలు తీయ‌డం వ‌ల‌న‌ స‌మ‌యం వృధా చేయ‌డంతోపాటూ కూలీల‌ను వేధించ‌డ‌మేన‌ని మండిప‌డ్డారు. ప్ర‌స్తుతం ఎండ‌లు మండుతున్న త‌రుణంలో కూలీల భ‌ద్ర‌త‌కు ప‌లు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. కూలీలు సేద‌తీరేందుకు ప‌నిప్రదేశంలో షామియానా ఏర్పాటు చేయాల‌ని సూచించారు. డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా ఓఆర్ఎస్ ఇవ్వాల్సి ఉన్నా.. ఫీల్డ్ అసిస్టెంట్‌ల‌కు అవి ఇంకా అంద‌లేద‌న్నారు.

ఒకే కుటుంబంలో భార్యాభ‌ర్త‌ల ప‌ని రోజుల‌ను 50కి కుదించ‌డం స‌రికాద‌న్నారు. భార్యాభ‌ర్త‌లైనా వేర్వేరు ల‌బ్ధిదారుల కార్డు క‌లిగిన ప్ర‌తికూలీకి 120 రోజుల పాటూ ప‌నులు క‌ల్పించాల‌ని డిమాండ్ చేశారు. ఇలా ప‌ని రోజుల కుదింపుతో వారు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నార‌ని వాపోయారు. ప‌ని ప్ర‌దేశంలో గుంత‌లు త‌వ్వేట‌ప్పుడు విష‌సర్పాలు కూలీల‌ను కాటేస్తే.. దానికి ప్ర‌థ‌మ చికిత్స వైద్య ప‌రిక‌రాలు, మందుల‌ను అందించే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ కూలీ కుటుంబాన్ని ఆదుకునేలా ప్ర‌మాద బీమా ప‌థ‌కాన్ని (insurance scheme) అమ‌లు చేయాల‌న్నారు. కూలీ వారానికోసారి త‌ప్ప‌కుండా ఇవ్వాల్సిందేన‌ని డిమాండ్ చేశారు.

Also Read..

గుంటనక్కతో గుంపు మేస్త్రీ డీల్.. క‌విత విమ‌ర్శ‌లు..

పెద్ది షూటింగ్‌కు గుమ్మ‌డికాయ కొట్టేది అప్పుడే - క్లారిటీ ఇచ్చిన డైరెక్ట‌ర్‌

రక్షకులే భక్షకులు: మాస్టర్ కీతో డోర్ తెరిచి.. సీసీటీవీలు ఆఫ్ చేసి.. వ్యాపారి ఇంట్లో పోలీసుల భారీ చోరీ

Advertisement
Advertisement