త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPI Narayana | వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్ర‌ధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయ‌ణ‌

CPI Narayana | వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు పేరు పెట్టాల‌ని సీపీఐ నేత నారాయ‌ణ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు నారాయ‌ణ స్పందిస్తూ ఈ సూచన చేశారు.

S

Telangana | Published On Sep 20, 2026, 12.07 pm IST

CPI Narayana | వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్ర‌ధాని పీవీ పేరు పెట్టాలి : సీపీఐ నారాయ‌ణ‌
Advertisement

CPI Narayana | త్రినేత్ర‌.న్యూస్ : వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టుకు మాజీ ప్ర‌ధాని పీవీ న‌ర‌సింహారావు పేరు పెట్టాల‌ని సీపీఐ నేత నారాయ‌ణ సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్‌కు నారాయ‌ణ స్పందిస్తూ ఈ సూచన చేశారు.

‘ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రజాపాలనలో వరంగల్‌ విమానాశ్రయ కల నెరవేరనుంది. కొత్త ఎయిర్‌పోర్టుకు ఏ పేరు పెడితే బాగుంటుందో సూచనలు ఇవ్వండి’ అంటూ.. ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి శనివారం ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేసిన సంగ‌తి తెలిసిందే.

సీఎం విజ్ఞ‌ప్తిపై ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా త‌క్ష‌ణ‌మే స్పందించారు. సాంస్కృతిక‌, వార‌స‌త్వ స్ఫూర్తిని ప్ర‌తిబింబించేలా రుద్ర‌మ ఇంట‌ర్నేష‌నల్ ఎయిర్‌పోర్టు( RIA ) లేదా కాక‌తీయ ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టు( KIA ) అని వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్టు( Warangal Airport )కు నామ‌క‌ర‌ణం చేయండి అని సీఎంకు సందీప్ రెడ్డి సూచించారు. మరో దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల స్పందిస్తూ.. సమ్మక్క సారక్క పేరు పెట్టాలని సూచించారు.

Advertisement
Advertisement