VB-G RAM G | ఏపీలో రూ.312, తెలంగాణలో రూ.308.. వీబీ జీరామ్‌జీ చట్టం కింద చెల్లించే వేతనాలను ఫిక్స్ చేసిన కేంద్రం
VB-G RAM G | వీబీ జీరామ్‌జీ చట్టం నేటి నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చట్టం కింద నైపుణ్యం లేని శ్రామికులకు చెల్లించే వేతనాల రేట్లను (wage rates) కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
VB-G RAM G | మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయిమెంట్ గ్యారెంటీ యాక్ట్ (Mahatma Gandhi National Rural Employment Guarantee Act-MGNREGA) స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన విక్‌సిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీన్ బిల్లు (VB-G RAM G Bill) నేటి నుంచి దేశ వ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ చట్టం కింద నైపుణ్యం లేని శ్రామికులకు చెల్లించే వేతనాల రేట్లను (wage rates) కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంగళవారం అర్ధరాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ నోటిఫికేషన్ ప్రకారం.. వివిధ రాష్ట్రాల్లో రోజువారీ వేతనాలు రూ.300 నుంచి రూ.409 మధ్య నిర్ణయించారు. సిక్కింలోని కొన్ని నిర్దిష్ట గ్రామ పంచాయతీల్లో మాత్రం ప్రత్యేకంగా రూ.450గా నిర్ణయించారు. కొత్త పథకం కింద అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, అస్సాం, త్రిపుర, సిక్కిం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో వేతనాలు 15% కంటే ఎక్కువ పెరిగాయి. అయితే, దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 3 శాతం కంటే తక్కువే పెంచడం గమనార్హం.
గుజరాత్, మణిపూర్, మిజోరాం, రాజస్థాన్, ఒడిశా, జమ్ము కశ్మీర్, లడఖ్, మేఘాలయ, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, త్రిపుర, బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్.. ఈ 21 రాష్ట్రాల్లో వీబీ- జీ రామ్ జీ పథకం కింద రోజువారీ వేతన రేటును రూ. 300గా నిర్ణయించారు.
తెలంగాణలో రూ.308, ఆంధ్రప్రదేశ్‌లో రూ.312, మహారాష్ట్రలో రూ. 317, దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులో రూ.340 చొప్పున, తమిళనాడులో రూ.345, పుదుచ్చేరిలో రూ. 347, అండమాన్ నికోబార్ (Andaman District), లక్షద్వీప్‌లో రూ.348 చొప్పున, పంజాబ్‌లో రూ.360, అండమాన్ నికోబార్ (Nicobar District) రూ.367, కర్ణాటకలో రూ.382, కేరళలో రూ.401, గోవాలో రూ.406గా కూలీలకు రోజువారీ వేతనం చెల్లించనున్నారు. సిక్కింలోని మూడు గ్రామ పంచాయతీలు జ్ఞాతంగ్ (Gnathang), లాచుంగ్ (Lachung), లాచెన్ (Lachen)ల్లో వేతన రేటును రూ.450గా నిర్ణయించారు.
Also Read..
బీజేపీ నేతలు ఓట్ల దొంగలు.. మీనాక్షి సీటు చోరీ చేశారు : టీ పీసీసీ చీఫ్
యాక్ట్ ఫైబర్‌నెట్ కొత్త స్ట్రీమ్ టీవీ 4కే డివైస్.. ఏఐతో కంటెంట్‌ను ఈజీగా వెదకవచ్చు..
బీజేపీకి రాజ్యాంగంపై ఎలాంటి విశ్వాసం లేదు : కేసీ వేణుగోపాల్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం
- ●MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి
- ●Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి
- ●Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
- ●CM Revanth Reddy | హైదరాబాద్ వస్తున్నా.. అన్నింటిపై మాట్లాడుతా : సీఎం రేవంత్‌రెడ్డి
- ●Revanth Reddy | లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్నా.. వచ్చాక అన్నీ మాట్లాడ్తా: సీఎం రేవంత్

Mumbai Ganpati Idol Collapse | ముంబైలో వినాయక ఊరేగింపులో అపశృతి: 22 అడుగుల విగ్రహం కూలి ఇద్దరు దుర్మరణం

MLA Megha Reddy | చిన్నారెడ్డి వివరణ కరెక్టు లేదు.. చర్యలు తీసుకోండి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

Minister Komati Reddy | నల్గొండను సూపర్ స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతాం : మంత్రి కోమటిరెడ్డి

Dr Gadala Srinivasa Rao | పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో జనసేన: డాక్టర్ గడల శ్రీనివాసరావుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్






