Peddi Movie | పెద్ది షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేది అప్పుడే – క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్
రామ్‌చరణ్ పెద్ది సినిమాకు గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడన్నది క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ మంగళవారం నుంచి హైదరాబాద్‌లో మొదలైంది. మరో ఆరు రోజుల్లో రామ్‌చరణ్ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుందట.
Entertainment | Published On Apr 21, 2026, 5.36 pm IST
Peddi Movie | రామ్‌చరణ్ పెద్ది షూటింగ్ కొన...సాగుతూనే ఉంది. ఈ పాన్ ఇండియన్ మూవీకి గుమ్మడికాయ కొట్టేది ఎప్పుడన్నది అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏప్రిల్ 30న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను జూన్‌కు పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు ఇటీవల మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సానా స్లో టేకింగ్ పెద్ది పోస్ట్‌పోన్‌కు కారణమంటూ ప్రచారం జరుగుతోంది. గురువు సుకుమార్‌కు మించి ఒక్కో ఫ్రేమ్‌ను నెలల తడబడి చెక్కుతూనే ఉన్నాడని అందుకే షూటింగ్ ఆలస్యమవుతోందంటూ బుచ్చిబాబును నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏప్రిల్ నెలాఖరులోగా పెద్ది షూటింగ్ కంప్లీట్ కావడం అనుమానమేనంటూ ప్రచారం జరిగింది. ఈ రూమర్లను మేకర్స్ ఖండించారు.
స్పెషల్ సాంగ్...
మరో ఆరు రోజుల్లో పెద్ది షూటింగ్ కంప్లీట్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా మూవీ లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ మంగళవారం హైదరాబాద్‌లో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌చరణ్‌పై ఓ స్పెషల్ సాంగ్‌ను బుచ్చిబాబు సానా షూట్ చేస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సాంగ్‌లో చరణ్‌తో కలిసి హీరోయిన్ సంయుక్త మీనన్ ఆడిపాడబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రిలీజ్ డేట్ ఫైనల్...
షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాతే పెద్ది రిలీజ్ డేట్‌ను ఫైనల్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారట. జూన్ 4 లేదంటే జూన్ 26లలో సినిమా రిలీజయ్యేది ఎప్పుడన్నది త్వరలోనే క్లారిటీ రానుందట. పెద్ది మూవీలో రామ్‌చరణ్ సరసన జాన్వీకపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. శివరాజ్‌కుమార్, జగపతిబాబు , దివ్యేందు శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వృద్ధి సినిమాస్ సంస్థ పెద్ది సినిమాను నిర్మిస్తోంది.
సంబంధిత వార్తలు

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు – రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
నవంబర్ 28, 2026

RC 17 | రామ్‌చరణ్, సుకుమార్ సినిమాలో నటించే ఛాన్స్ కావాలా? – బంపర్ ఆఫర్ ప్రకటించిన మేకర్స్
నవంబర్ 27, 2026

Satvika Veeravalli | కార్పొరేట్ కొలువు నుంచి స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్.. హాట్ టాపిక్‌గా మారిన టాలీవుడ్ బ్యూటీ!
నవంబర్ 25, 2026
తాజావార్తలు
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన
- ●Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్
- ●V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి
- ●Tata Sons | టాటా గ్రూప్ వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన టాటా సన్స్
- ●High Court | బావర్చి హోటల్ ఘటనలో బీఆర్ఎస్ నేతలకు భారీ ఊరట.. అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఆదేశాలు

Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్

Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

Ar Rahman | మ్యూజిక్ నచ్చలేదని నిర్మాత రెమ్యూనరేషన్ ఇవ్వలేదు - రణబీర్‌కపూర్ సినిమాపై ఏఆర్ రెహమాన్ కామెంట్స్

V Srinivas Goud | ఓబీసీ కుల గణనకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలలో తీర్మానాలు చేయాలి



