CM Revanth Reddy | నైపుణ్యమే.. మీ భవిష్యత్తుకు మార్గం : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy | నైపుణ్యమే సుస్థిర భవిష్యత్తుకు మార్గమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. “వరల్డ్ యూత్ స్కిల్స్ డే” (World Youth Skills Day) సందర్భంగా యువతకు కీలక సూచనలు చేశారు.
CM Revanth Reddy | త్రినేత్ర.న్యూస్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పాటు శరవేగంగా మారుతున్న ప్రపంచ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని యువత విద్యతో పాటు జీవితానికి, ఉపాధికి, సమాజ అభివృద్ధికి ఉపయోగపడే నైపుణ్యాలను నేర్చుకోవలసిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అభిప్రాయపడ్డారు. “వరల్డ్ యూత్ స్కిల్స్ డే”సందర్భంగా యువతకు కీలక సూచనలు చేశారు.
యువత తమలోని ప్రతిభను, నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుంటూ మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎదగాలని పేర్కొన్నారు. స్కిల్స్ వ్యక్తిగత విజనానికే కాదు.. సమాజ ప్రగతికి, దేశ అభివృద్ధికి కూడా బలమైన పునాది అని పేర్కొన్నారు. యువత ఎప్పటికప్పుడు స్కిల్స్ అందిపుచ్చుకోవాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను ఆధునిక సాంకేతిక విజ్ఞాన కేంద్రాలుగా తీర్చిదిద్దడమే కాకుండా ప్రత్యేకంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రస్తావించారు.
ఆధునిక ప్రపంచంలో వ్యవస్థలకు అవసరమైన నైపుణ్యత అందుబాటులో లేకపోవడం నిరుద్యోగానికి దారితీస్తోందని పేర్కొన్నారు. "నేర్చుకోవడం ఆపొద్దు... స్కిల్స్ పెంచుకోవాలి... మీ విజయంతో పాటు సమాజ అభివృద్ధికి కూడా మీ వంతు పాత్ర పోషించండి. నైపుణ్యమే ఆత్మవిశ్వాసానికి, ఉపాధికి, సుస్థిర భవిష్యత్తుకు మార్గం. ప్రపంచ యువత నైపుణ్య దినోత్సవం సందర్భంగా యువతకు శుభాకాంక్షలు" అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Also Read..
బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులకు అలర్ట్..
అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు
అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి.. 8 నెలల పాటు ISSలోనే.. కీలక పరిశోధనలు
తాజావార్తలు
- ●Telegram | టెలిగ్రామ్‌లో భారీ అప్డేట్.. యూజర్లకు రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్ సహా కొత్త ఫీచర్లు..
- ●Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
- ●CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోరనున్న బీఆర్ఎస్
- ●Bonalu 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాలు.. రేపే తొలిబోనం
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో కొనసాగుతున్న తీవ్ర అస్థిరత.. పెట్టుబడిదారులకు అలర్ట్..
- ●Mudragada Padmanabham | అధికార లాంఛనాలతో ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు

Telegram | టెలిగ్రామ్‌లో భారీ అప్డేట్.. యూజర్లకు రిచ్ టెక్స్ట్ ఎడిటర్, కమ్యూనిటీస్ సహా కొత్త ఫీచర్లు..

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం

CCI | సీసీఐని పునఃప్రారంభించండి.. కేంద్ర మంత్రిని కోరనున్న బీఆర్ఎస్

Bonalu 2026 | తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా ఆషాఢ బోనాలు.. రేపే తొలిబోనం






