ISS | అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న భారత సంతతి వ్యోమగామి.. 8 నెలల పాటు ISSలోనే.. కీలక పరిశోధనలు
ISS | భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (NASA astronaut) అనిల్ మేనన్ (Anil Menon) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) విజయవంతంగా చేరుకున్నారు.
International | Published On Jul 15, 2026, 10.56 am IST
ISS | త్రినేత్ర.న్యూస్ : భారత సంతతికి చెందిన నాసా వ్యోమగామి (NASA astronaut) అనిల్ మేనన్ (Anil Menon) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) విజయవంతంగా చేరుకున్నారు. రష్యాకు చెందిన సోయుజ్ ఎంఎస్-29 (Soyuz MS-29) వ్యోమనౌక ద్వారా ఇద్దరు రష్యన్ వ్యోమగాములతోకలిసి బుధవారం తెల్లవారుజామున ఐఎస్‌ఎస్‌లోకి ప్రవేశించారు. ఈ బృందం దాదాపు ఎనిమిది నెలల పాటు ఐఎస్‌ఎస్‌లోనే ఉండనుంది. కీలకమైన శాస్త్రీయ పరిశోధనలు, సాంకేతిక ప్రయోగాలు చేపట్టనుంది.
కజకిస్థాన్‌లోని బైకనూర్ కాస్మోడ్రోమ్ నుంచి మంగళవారం రాత్రి 8:15 గంటలకు వీరి ప్రయాణం మొదలైంది. కేవలం మూడు గంటల్లోనే ఐఎస్ఎస్‌కు చేరుకున్నారు. అక్కడ ఇప్పటికే ఉన్న వ్యోమగాములు మేనన్ బృందానికి స్వాగతం పలికారు. ఈ బృందం సుమారు ఎనిమిది నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో విధులు నిర్వహించి 2027 ఏప్రిల్‌లో భూమికి తిరిగి రానుంది. అంతరిక్షంలో ఎక్కువకాలం గడపడం వల్ల మానవ శరీరంలో జరిగే మార్పులపై అనిల్ మేనన్ పరిశోధనలు నిర్వహించనున్నారు. హై-పెర్ఫార్మెన్స్ కంప్యూటర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వ్యవస్థలకు అవసరమైన సెమీకండక్టర్ స్ఫటికాలను అంతరిక్షంలో తయారుచేసే ప్రక్రియను మెరుగుపరచడంపై కూడా మేనన్ పరిశోధనలు చేయనున్నారు. అదేవిధంగా.. భవిష్యత్ అంతరిక్ష యాత్రల్లో భూమి నుంచి వైద్య సహాయం అవసరం లేకుండా ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR), ఏఐ పద్ధతులను ఉపయోగించి అల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించడంపై దృష్టి పెడతారు.
STORY | NASA astronaut Anil Menon, two others reach International Space Station
NASA astronaut Anil Menon and two Russian cosmonauts reached the International Space Station to hugs and handshakes in the early hours of Wednesday (India time) onboard Soyuz MS-29 spacecraft after a… pic.twitter.com/3DQAt2UFae
— Press Trust of India (@PTI_News) July 15, 2026
Also Read..
ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ గుడ్‌న్యూస్.. ఐక్లౌడ్‌కు ప్రత్యామ్నాయంగా కొత్త బ్యాకప్ ఫీచర్..
భారత్‌పై 100% సుంకాలు.. రష్యా ఆంక్షల బిల్లుకు అమెరికా సవరణ
కోర్టు హాలులో న్యాయమూర్తులపైకి పేపర్లు.. న్యాయ విద్యార్థి అరెస్ట్
తాజావార్తలు
- ●Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్
- ●Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్
- ●KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్
- ●Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదు..?
- ●Sampoornesh Babu | కెరీర్లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ ఈ సినిమాకే తీసుకున్నా - ప్యారడైజ్‌పై సంపూర్ణేష్ బాబు కామెంట్స్
- ●Sushila Rani’s Surrender | చరమాంకానికి మావోల పోరు.. లొంగిపోయిన మరో కీలక నాయకురాలు

Superintelligence Human Control | ఏఐ ముసుగులో పెను ముప్పు.. మనుషుల చేతుల్లో లేకపోతే ఏఐ వ్యర్థం : సత్య నాదెళ్ల స్ట్రాంగ్ వార్నింగ్

Malayalam | మలయాళ హీరోయిన్ను పెళ్లిచేసుకున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాటోగ్రాఫర్

KTR | రేవంత్ రెడ్డి ప్రతి స్కీమ్ వెనుక ఒక స్కామ్ : కేటీఆర్

Bandi Sanjay | బీఆర్ఎస్ నేతలను ఎందుకు జైలుకు పంపడం లేదు..?






