త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న తీవ్ర అస్థిర‌త‌.. పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌..

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం మ‌ళ్లీ మొద‌ల‌వ్వ‌డ‌మే కాక‌, ఇటీవలి క‌న్నా తీవ్ర రూపం దాల్చ‌డంతో అంత‌ర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ తీవ్ర అనిశ్చితిలో కొన‌సాగుతున్నాయి. పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డులు పెట్టాలా వ‌ద్దా అని ఆందోళ‌న చెందుతున్నారు. మరోవైపు బులియ‌న్ మార్కెట్ల‌లోనూ తీవ్ర అస్థిర‌త నెల‌కొంది.

S

Business | Published On Jul 15, 2026, 11.04 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో కొన‌సాగుతున్న తీవ్ర అస్థిర‌త‌.. పెట్టుబ‌డిదారుల‌కు అల‌ర్ట్‌..
Advertisement

Gold And Silver Prices Today | ప‌శ్చిమ ఆసియాలో అమెరికా, ఇరాన్‌ల మ‌ధ్య యుద్ధం మ‌ళ్లీ మొద‌ల‌వ్వ‌డ‌మే కాక‌, ఇటీవలి క‌న్నా తీవ్ర రూపం దాల్చ‌డంతో అంత‌ర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లు మ‌ళ్లీ తీవ్ర అనిశ్చితిలో కొన‌సాగుతున్నాయి. పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డులు పెట్టాలా వ‌ద్దా అని ఆందోళ‌న చెందుతున్నారు. మరోవైపు బులియ‌న్ మార్కెట్ల‌లోనూ తీవ్ర అస్థిర‌త నెల‌కొంది. గ‌త కొద్ది నెల‌లుగా బంగారం, వెండి ధ‌ర‌ల్లో తీవ్ర అస్థిర‌త చోటు చేసుకుంటోంది. దీంతో పెట్టుబ‌డిదారులు పెట్టుబ‌డి పెట్టేముందు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇక బుధ‌వారం అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌లు స్వ‌ల్పంగా తగ్గాయి. ఔన్స్ బంగారం ధ‌ర 0.64 శాతం మేర త‌గ్గి 4,026 డాల‌ర్ల వ‌ద్ద ఉండ‌గా, వెండి ధ‌ర 0.66 శాతం త‌గ్గి 58 డాల‌ర్ల వ‌ద్ద ఉంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 755 పాయింట్లు త‌గ్గి 1,41,500 వ‌ద్ద ఉండ‌గా, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 799 పాయింట్లు త‌గ్గి 2,22,308 వ‌ద్ద ఉంది. ఇక దేశీయ స్పాట్ మార్కెట్‌లో మాత్రం బంగారం ధ‌ర‌లు స్వ‌ల్పంగా పెరిగాయి. వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.14,357 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,14, 856గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,43,570 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.14,35,700 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.7,700 పెరిగింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.13,160 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,05,280గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,31,600 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.13,16,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.7,000 పెరిగింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.10,767 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.86,136గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,07,670 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.10,76,700గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,700 పెరిగింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,35,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,350గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌రలో ఎలాంటి మార్పు లేదు. హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.2,40,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.2,400 గా ఉంది.

Advertisement
Advertisement