BRS | రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత.. బీఆర్ఎస్ వాయిదా తీర్మానం
BRS | అమెరికా, ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ (BRS) శాసన సభా పక్షం వాయిదా తీర్మానం (Adjournment Motion) ప్రతిపాదించింది.
BRS | త్రినేత్ర.న్యూస్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Assembly Budget Session) ఆరో రోజు కొనసాగుతున్నాయి. అమెరికా, ఇజ్రాయెల్ -ఇరాన్ యుద్ధం నేపథ్యంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్, యూరియా తదితరాల అందుబాటుపై ప్రజల్లో వ్యక్తమవుతున్న భయాందోళనలపై శాసనసభలో చర్చించి రాష్ట్ర ప్రభుత్వం తగిన కార్యాచరణ ప్రకటించాలని కోరుతూ బీఆర్‌ఎస్ (BRS) శాసన సభా పక్షం వాయిదా తీర్మానం (Adjournment Motion) ప్రతిపాదించింది.
పెట్రోల్ బంక్‌ల వద్ద కిలోమీటర్ల మేర క్యూ..
ఇరాన్ యుద్ధం భారత్‌లో లాక్‌డౌన్ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. హైదరాబాద్ (Hyderabad)లో పరిస్థితి మరింత అధ్వానంగా తయారైంది. పెట్రోల్, డీజిల్ దొరకదన్న భయంతో ప్రజలు బంకుల (petrol pumps) వద్దకు పరుగులు తీస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. కొందరైతే ఏకంగా పెద్ద పెద్ద క్యాన్‌లకు పెట్రోల్ నింపుకుని వెళ్తున్నారు. అదే సమయంలో నగరంలోని పలు పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
మంగళవారం రాత్రి నుంచే నగరంలోని దాదాపు అన్ని పెట్రోల్ బంకుల వద్ద ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ ఉదయం కూడా ఆఫీసులకు వెళ్లే వాళ్లు (employees) ఉదయం నుంచే పెట్రోల్ కోసం పరుగులు తీస్తున్నారు. మరోవైపు ఇంధనం దొరక్క నగరంలోని పలు ప్రాంతాల్లో ఆటోలు కూడా బంద్ అయ్యాయి. ఫలితంగా ఉదయం ఆఫీసుకు వెళ్లే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్సుల వెంట పరుగులు తీయాల్సిన పరిస్థితి. అదే సమయంలో బస్సులు కూడా ఫుల్‌గా ఉండటంతో ఉద్యోగులకు తిప్పలు తప్పడం లేదు. దీంతో సామాన్యులు మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితులను గుర్తు చేసుకుంటున్నారు.
ట్రెండింగ్‌లో లాక్‌డౌన్
మరోవైపు ప్రస్తుతం సోషల్ మీడియాలో లాక్‌డౌన్ ఇండియా ట్రెండింగ్‌లో ఉంది. గూగుల్ సెర్చింగ్‌లో కూడా లాక్‌డౌన్ ఇన్ ఇండియా తొలి స్థానంలో నిలిచింది. లోక్‌సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ప్రసంగిస్తూ.. మనం కరోనా పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ హింట్ ఇవ్వడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. స్వయంగా ప్రధాన మంత్రే పార్లమెంట్ సాక్షిగా ఇలా మాట్లాడటం ప్రజల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది. మళ్లీ లాక్‌డౌన్ తప్పదా అన్న భయాలు నెలకొంటున్నాయి.
సంబంధిత వార్తలు

Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ వద్దిరాజు.. నియమించిన కేసీఆర్
జులై 9, 2026

Tungathurthi Congress Politics | తుంగతుర్తి కాంగ్రెస్‌లో రచ్చ.. బీఆర్ఎస్ నేతలకు పట్టాభిషేకమా? పీసీసీ చీఫ్‌కు ఎంపీ చామల లేఖ
జులై 7, 2026

Palla Rajeshwar Reddy | రైతాంగాన్ని ఆదుకునేందుకు నీటిని ఎత్తిపోయాలి : పల్లా రాజేశ్వర్ రెడ్డి
జులై 7, 2026
తాజావార్తలు
- ●Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..
- ●JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్
- ●Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్
- ●Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ
- ●Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
- ●CM Revanth Reddy | హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..

JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్

Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్

Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు - వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ



