Nidhhi Agerwal | పెళ్లికి తొందరేం లేదు – వెడ్డింగ్ రూమర్లపై రాజాసాబ్ హీరోయిన్ క్లారిటీ
రాజాసాబ్ బ్యూటీ నిధి అగర్వాల్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై ఓ ఈవెంట్‌లో నిధి అగర్వాల్ రియాక్ట్ అయ్యింది. పెళ్లి విషయంలో తొందర పడటం లేదని అన్నది. తాను కోరుకున్న లక్షణాలున్న అబ్బాయి ఇంకా తారసపడలేదని చెప్పింది. సౌత్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానని పేర్కొన్నది.
Entertainment | Published On Jul 9, 2026, 3.03 pm IST
Nidhhi Agerwal | ఇదివరకు పెళ్లయితే కెరీర్ ముగిసిపోయినట్లేనని భావించేవారు హీరోయిన్లు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. పెళ్లి, పిల్లలతో సంబంధం లేకుండా హీరోయిన్లు సినీ పరిశ్రమలో దూసుకుపోతున్నారు. టాప్ పొజిషన్‌లో ఉండగానే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. అలియాభట్, దీపికా పడుకోణ్, కీర్తి సురేష్ తో పాటు చాలా మంది అందాల నాయికలు ఓ వైపు గృహిణిగా బాధ్యతలు నిర్వహిస్తూనే టాప్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోన్నాయి.
పెళ్లి రూమర్లు...
తాజాగా ఈ లిస్ట్‌లో నిధి అగర్వాల్ అడుగులు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలెక్కనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లపై ఓ ప్రమోషనల్ ఈవెంట్‌లో నిధి అగర్వాల్ రియాక్ట్ అయ్యింది. మనసుకు నచ్చిన వాడు దొరికితే పెళ్లి చేసుకోవడానికి రెడీ అని అన్నది.
వ్యతిరేకం కాదు...
"వయసైపోతుందనో, సొసైటీ ఒత్తిడులతో ఇతర కారణాల వల్ల పెళ్లి చేసుకోవాలనే అభిప్రాయానికి నేను పూర్తి వ్యతిరేకం. వివాహం అన్నది ప్రతి ఒక్కరి జీవితంలో తీసుకొనే కీలక నిర్ణయాల్లో ఒకటి. దానిపైనే భవిష్యత్తు, కలలు, ఆనందంతో ఎన్నో ఆధారపడి ఉంటాయి. అందుకే పెళ్లి విషయంలో తొందరపడటం లేదు. అలాగని పెళ్లికి వ్యతిరేకం కాదు. నేను కోరుకున్న లక్షణాలున్న అబ్బాయి ఇప్పటివరకు తారసపడలేదు. అలాంటి వాడు దొరికితే పెళ్లి గురించి ఆలోచిస్తా. సౌత్ అబ్బాయినే పెళ్లి చేసుకోవాలని ఉంది" అని నిధి అగర్వాల్ చెప్పింది.
టైమ్ ఉంది...
"పెళ్లికి ఇంకా టైమ్ ఉంది. ప్రస్తుతం కెరీర్ మీదనే ఫోకస్ చేస్తున్నా. ప్రస్తుతం తెలుగులో రెండు సినిమాలను అంగీకరించా. ఆగస్ట్‌లో ఒకటి...అక్టోబర్‌లో మరో సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నాయి. హిందీలో రెండు సినిమాల షూటింగ్‌లు జరుగుతున్నాయి" అని నిధి అగర్వాల్అన్నది.
రాజాసాబ్ డిజాస్టర్....
ఈ ఏడాది సంక్రాంతికి రాజాసాబ్‌తో ప్రేక్షకులను పలకరించింది నిధి అగర్వాల్. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాపై ఈ ముంబై బ్యూటీ చాలానే ఆశలు పెట్టుకుంది. కానీ ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్ కారణంగా ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. రాజాసాబ్ డిజాస్టర్‌గా నిలిచిన తన పాత్ర విషయంలో మాత్రం సంతృప్తిగానే ఉన్నట్లు నిధి అగర్వాల్ చెప్పింది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో కలిసి నటించాలనే తన కల ఈ సినిమాతో తీరిందని అన్నది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Taylor Swift | పెళ్లి కోసం 190 కోట్ల ఖర్చు – రిటర్న్ గిఫ్ట్‌గా డైమండ్స్ – గ్రాండ్‌గా పాప్ సింగర్ టేలర్ స్విఫ్ట్ వెడ్డింగ్
జులై 4, 2026

Nabha Natesh | యాక్సిడెంట్ వల్ల ఏడాదిన్నర సినిమాలకు దూరం – సినిమా కోసం వెజిటేరియన్‌గా మారా – నభానటేష్ కామెంట్స్
జూన్ 29, 2026

Abhishek Porel | పెండ్లి పేరుతో మోసం చేశాడు.. ఐపీఎల్ ఆటగాడిపై యువతి ఫిర్యాదు
జూన్ 24, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



