Fee reimbursement | కొత్త అడ్మిషన్లకు ఫీజు చెల్లిస్తాం.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర సర్కార్
Fee reimbursement | విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చేరే విద్యార్థుల కొత్త అడ్మిషన్లకూ ఫీజు చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆగస్టు 15లోగా చెల్లిస్తామని హైకోర్టుకు స్పష్టం చేసింది.
Fee reimbursement | త్రినేత్ర.న్యూస్: విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో చేరే విద్యార్థుల కొత్త అడ్మిషన్లకూ ఫీజు చెల్లిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఆగస్టు 15లోగా చెల్లిస్తామని హైకోర్టుకు స్పష్టం చేసింది. రెండు, మూడు, నాలుగు సంవత్సరాల విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను సైతం ఆగస్టు 15లోపు క్లియర్ చేస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరగగా పై విధంగా ప్రభుత్వం స్పందించింది.
ఫీజులను నేరుగా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ (DBT) పద్ధతి ద్వారా విద్యార్థుల ఆధార్-సీడెడ్ బ్యాంకు ఖాతాలకే జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. ఫీజుల చెల్లింపు విషయంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇందుకు రూ.వెయ్యి కోట్లు కావొచ్చని ఆయన పేర్కొన్నారు. బకాయిల అంశంపై ప్రైవేట్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్ల విచారణ సందర్భంగా ఈ ప్రకటన చేసింది.
విద్యార్థుల ఖాతాల్లో ఫీజులు జమయ్యాక వారు చెల్లించకపోతే బకాయిల బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందో లేదో పిటిషనర్ల తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. రూ.2,800 కోట్ల బకాయి ఉండగా రూ.250 కోట్ల కేటాయింపు చేశారని తెలిపారు. గత బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారన్నదానిపై స్పష్టత ఇవ్వడం లేదన్నారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!





