JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలి : జేడీ వాన్స్
JD Vance | అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసా దుర్వినియోగాలకు (H-1B visa programme) పాల్పడే వారికి అమెరికాలోకి ప్రవేశం ఉండదని తేల్చి చెప్పారు.
International | Published On Jul 9, 2026, 3.14 pm IST
JD Vance | త్రినేత్ర.న్యూస్ : హెచ్-1బీ వీసా దుర్వినియోగాలకు (H-1B visa programme) పాల్పడే వారిపై అమెరికా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్న కంపెనీలు, వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ వ్యవహారంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తాజాగా స్పందించారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని స్పష్టం చేశారు. వీసా మోసాలకు పాల్పడే వారిపై అమెరికా కార్మిక శాఖ (US Labour Ministry) ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించిందని, విచారణ నిమిత్తం కొంతమందికి నోటీసులు కూడా జారీ చేసిందని తెలిపారు.
విస్కాన్సిన్ రాష్ట్రంలోని మిల్వాకీ (Milwaukee) నగరంలో జేడీ వాన్స్ పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో వాన్స్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్ కార్మికులకే దక్కాలని.. విదేశీ మోసగాళ్లకు (foreign fraudsters) కాదు అంటూ వ్యాఖ్యానించారు. దీనిపై కార్మిక శాఖ గట్టిగా పోరాడుతోందని చెప్పారు. అత్యున్నత ప్రతిభ కలిగిన నిపుణులు అమెరికాలో పనిచేసేందుకు వీలుగా హెచ్-1బీ వీసాలను రూపొందించినట్లు తెలిపారు. కానీ కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు, వ్యక్తులు ఈ వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు.
తక్కువ వేతనాలతో విదేశీ ఉద్యోగులను నియమించుకొని అమెరికా కార్మికుల వేతనాలను తగ్గిస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము కాపాడటంతోపాటు వీసా దుర్వినియోగాన్ని అరికట్టడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. వీసా దుర్వినియోగానికి పాల్పడే వారికి అమెరికాలోకి ప్రవేశం ఉండదని ఈ సందర్భంగా వాన్స్ తేల్చి చెప్పారు.
Also Read..
షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ లాంచ్.. రూ.10.49 లక్షల నుంచే ధర, 5 స్టార్ సేఫ్టీతో మార్కెట్లోకి..
సంబంధిత వార్తలు

US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! “మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం” అన్న జేడీ వాన్స్
జూన్ 21, 2026

JD Vance | పాకిస్థాన్‌లో పత్రికా స్వేచ్ఛ లేదు.. జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
జూన్ 20, 2026

Donald Trump | వైట్‌హౌస్ కరస్పాండెంట్ డిన్నర్లో కాల్పులు.. తృటిలో తప్పించుకున్న డొనాల్డ్ ట్రంప్
ఏప్రిల్ 26, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



