Google Photos | గూగుల్ ఫొటోస్‌లో కొత్త ఏఐ మ్యాజిక్.. వీడియోలను క్షణాల్లో కొత్త లుక్‌లోకి మార్చుకోవచ్చు..
Google Photos | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ ఫొటోస్ యాప్‌లో వీడియో రీమిక్స్ అనే కొత్త ఏఐ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వీడియోలను ఏఐ ఆధారిత ఎఫెక్ట్‌లతో పూర్తిగా కొత్త స్టైల్‌లోకి మార్చుకోవచ్చు. ఇటీవల గూగుల్ ఫొటోస్‌లో ప్రవేశపెట్టిన ఇతర ఏఐ ఫీచర్ల సరసన ఈ వీడియో రీమిక్స్ కూడా చేరింది.
Technology | Published On Jul 9, 2026, 3.19 pm IST
Google Photos | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ ఫొటోస్ యాప్‌లో వీడియో రీమిక్స్ అనే కొత్త ఏఐ ఫీచర్‌ను అప్‌డేట్ చేసింది. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు తమ వీడియోలను ఏఐ ఆధారిత ఎఫెక్ట్‌లతో పూర్తిగా కొత్త స్టైల్‌లోకి మార్చుకోవచ్చు. ఇటీవల గూగుల్ ఫొటోస్‌లో ప్రవేశపెట్టిన ఇతర ఏఐ ఫీచర్ల సరసన ఈ వీడియో రీమిక్స్ కూడా చేరింది. ఇప్పటికే యాప్‌లో చర్మంపై మచ్చలను తొలగించడం, స్కిన్ టెక్స్చర్‌ను మెరుగుపరచడం, కళ్లను మరింత ప్రకాశవంతంగా చూపించడం, దంతాలను తెల్లగా కనిపించేలా చేయడం వంటి టచ్-అప్ టూల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే వినియోగదారుల దుస్తుల ఫొటోలతో డిజిటల్ వార్డ్‌రోబ్ రూపొందించి, వర్చువల్ ట్రై-ఆన్ సాయంతో కొత్త డ్రెస్సింగ్ ఐడియాలను సూచించే ఏఐ ఫీచర్‌ను కూడా గూగుల్ పరిచయం చేసింది.
సులభంగా ఏఐ ఎఫెక్ట్స్..
వీడియో రీమిక్స్ ఫీచర్ ద్వారా వీడియోలకు బ్యాక్‌గ్రౌండ్‌ను మార్చడం, లైటింగ్‌ను మెరుగుపరచడం, ఆర్టిస్టిక్ స్టైలైజేషన్ వంటి విభిన్న ఏఐ ఎఫెక్ట్‌లను సులభంగా మార్చవచ్చు. దీంతో సాధారణ వీడియోలను ఆకర్షణీయమైన కొత్త రూపంలోకి అప్‌డేట్ చేయవచ్చు. ఈ ఫీచర్‌ను ఉపయోగించాలంటే వినియోగదారులు ముందుగా తమ ఆండ్రాయిడ్, ఐఫోన్ లేదా ఐప్యాడ్ లోని గూగుల్ ఫొటోస్ యాప్‌ను తాజా వెర్షన్‌కు అప్‌డేట్ చేయాలి. అనంతరం యాప్‌లోని క్రియేట్ ట్యాబ్‌ను ఓపెన్ చేసి వీడియో రీమిక్స్ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు.
ఎవరెవరికి అందుబాటులో..
ప్రస్తుతం వీడియో రీమిక్స్ ఫీచర్‌ను గూగుల్ ఏఐ ప్లస్, గూగుల్ ఏఐ ప్రో, గూగుల్ ఏఐ అల్ట్రా సబ్‌స్క్రైబర్లకు ఎంపిక చేసిన దేశాల్లో అందిస్తున్నారు. ఈ జాబితాలో అమెరికా, అర్జెంటీనా, బంగ్లాదేశ్, బ్రెజిల్, కొలంబియా, ఈజిప్ట్, భారత్, ఇండోనేషియా, జపాన్, మెక్సికో, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్, దక్షిణ కొరియా, టర్కీ వంటి దేశాలు ఉన్నాయి. అందువల్ల యూజర్లు తమ ఏఐ ప్లాన్‌లో భాగంగా ఈ కొత్త ఫీచర్‌ను ప్రస్తుతం ఉపయోగించుకోవచ్చు.
సంబంధిత వార్తలు

WhatsApp | వాట్సాప్‌లో వస్తున్న కొత్త ఫీచర్.. కాంటాక్ట్‌ల బర్త్ డేలను ముందే చెబుతుంది..
జులై 10, 2026

Google | వినియోగదారులకు షాకిచ్చిన గూగుల్.. యూజర్ల డేటాతో ఏఐ మోడల్స్ ట్రెయినింగ్..?
జులై 8, 2026

Google | గూగుల్ స్టోరేజ్‌ను ఇక యూజర్లు జాగ్రత్తగా వాడాల్సిందే.. ఆండ్రాయిడ్ బ్యాకప్లకూ అదే లిమిట్..
జులై 8, 2026
తాజావార్తలు
- ●TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..
- ●Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..
- ●Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం
- ●Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!
- ●Horoscope | జూలై 13 రాశి ఫలాలు.. ఈ రాశివారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి!
- ●Mumbai Ahmedabad Bullet Train | దేశంలో పరుగులు తీయనున్న తొలి బుల్లెట్ ట్రైన్: ఫస్ట్ ఫేజ్ ఎప్పటినుంచంటే?

TG TET | నెట్ టెట్ ఫలితాలు విడుదల.. లింక్ ఇదే..

Fake SIR Staff | సర్ సర్వే పేరుతో వచ్చి మంగళసూత్రం కొట్టేశారు..

Pub Fire | పబ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 27 మంది దుర్మరణం

Guru Aditya Yoga | జూలై 16న గురు ఆదిత్య యోగం.. ఈ 9 తేదీల్లో జన్మించిన వారు కోటీశ్వరులైపోతారట..!



