Awiqli | షుగర్ బాధితులకు గుడ్‌న్యూస్.. ఇక వారికి ఒక్క ఇంజక్షన్ చాలు
Awiqli | మధుమేహం (diabetes)తో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్. రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే పని లేకుండా.. వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ (basal insulin) భారత్‌లో అందుబాటులోకి వచ్చింది.
Awiqli | త్రినేత్ర.న్యూస్ : మధుమేహం (diabetes)తో బాధపడుతున్న వారికి గుడ్ న్యూస్. రోజూ ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకునే పని లేకుండా.. వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్ (basal insulin) భారత్‌లో అందుబాటులోకి వచ్చింది. డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ నోవో నార్డిస్క్ (Novo Nordisk) అవిక్లీ (Awiqli) పేరుతో దీన్ని మార్కెట్లోకి విడుదల చేసింది. టైప్-1, టైప్-2 మధుమేహంతో బాధపడే వారికి ఇది ఉపయోగపడనుంది.
సాధారణంగా షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి రోజుకు ఒకసారి.. కొన్నిసార్లు రోజుకు పలుమార్లు ఇన్సులిన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆ బాధ లేకుండా నోవో నార్డిస్క్ ప్రపంచంలోనే తొలిసారి వారానికి ఒక్కసారి తీసుకునే బేసల్ ఇన్సులిన్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ద్వారా ఏడాదికి 365 ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇకపై ఏడాదికి కేవలం 52 వేసుకుంటే సరిపోతుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇన్సులిన్‌ల కంటే.. ఇది చాలా మెరుగ్గా పనిచేస్తుందని నార్డిస్క్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ విక్రాంత్ శ్రోత్రియా తెలిపారు.
ప్రస్తుతం భారత్‌లో దాదాపు 10.1 కోట్ల మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారని ఆయన తెలిపారు. మరో 13.6 కోట్ల మందిలో ప్రీ డయాబెటిస్ లక్షణాలు ఉన్నాయని, అలాగే తొమ్మిది లక్షల మందికిపైగా టైప్-1 మధుమేహ రోగులు ఉన్నారని చెప్పారు. టైప్-2 మధుమేహంతో బాధపడేవారిలో కూడా కొంతమందికి ఇన్సులిన్ తప్పనిసరిగా అవసరం అవుతోందని వివరించారు. వారందరికీ ఈ ఇంజక్షన్ ఎంతగానో ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
Also Read..
హైదరాబాద్‌లో కాలుష్య రహిత అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
భారత్‌కు షాక్.. ఇరాన్‌లోని చాబహార్ పోర్టుపై అమెరికా దాడులు
నిస్సాన్ టెక్టన్ ఎస్‌యూవీ లాంచ్.. రూ.10.49 లక్షల నుంచే ధర, 5 స్టార్ సేఫ్టీతో మార్కెట్లోకి..
తాజావార్తలు
- ●Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక
- ●Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!
- ●Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ●Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి
- ●Damodar Rajanarasimha | ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది: మంత్రి రాజనర్సింహ
- ●TTA Convention USA | అమెరికాలో టీటీఏ మహాసభల సందడి: తెలంగాణ అధికారులకు షార్లెట్‌లో ఆత్మీయ స్వాగతం

Mumbai Techie Suicide | ఎనిమిదేళ్ల ప్రేమ.. ప్రియుడి పెళ్లి ఫిక్స్ కావడంతో టెకీ సూసైడ్: కంటతడి పెట్టిస్తున్న ఆఖరి కోరిక

Revanth Reddy FICCI FLO | మహిళలకు సీఎం రేవంత్ బంపర్ ఆఫర్: ఫ్యూచర్ సిటీలో భూమి.. ఆర్టీసీ బస్సులకు ఓనర్లు మీరే!

Power Demand | ఎల్‌నినోపై అప్రమత్తంగా ఉండాలి.. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండొద్దు : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Singareni | సింగరేణి బొగ్గు నాణ్యతలో రాజీ లేదు: సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి






