త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threat | వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు

Bomb Threat | వరంగల్ జిల్లా కోర్టు (Warangal district court)కు బాంబు బెదిరింపులు (Bomb Threat) క‌ల‌క‌లం రేపాయి. కోర్టు ప్రాంగ‌ణంలో బాంబు పెట్టిన‌ట్లు ఆగంత‌కులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు.

D

Telangana | Published On Feb 26, 2026, 12.58 pm IST

Bomb Threat | వరంగల్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపులు
Advertisement

Bomb Threat | వరంగల్ జిల్లా కోర్టు (Warangal district court)కు బాంబు బెదిరింపులు (Bomb Threat) క‌ల‌క‌లం రేపాయి. కోర్టు ప్రాంగ‌ణంలో బాంబు పెట్టిన‌ట్లు ఆగంత‌కులు బెదిరింపుల‌కు పాల్ప‌డ్డారు.ఈ బెదిరింపుల‌తో అధికారులు వెంట‌నే అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బాంబ్ స్క్వాడ్‌, డాగ్ స్క్వాడ్‌తో ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్నారు. ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌గా సిబ్బందిని బ‌య‌ట‌కు పంపి త‌నిఖీలు చేప‌ట్టారు. ప్ర‌తీ గ‌దినీ త‌నిఖీ చేశారు.

ఈ త‌నిఖీల్లో ఎలాంటి పేలుడు ప‌దార్థాలు, అనుమానాస్ప‌ద వ‌స్తువులూ ల‌భించ‌లేదు. ఈ మేర‌కు ఘ‌ట‌న‌పై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. ఈ బెదిరింపు సందేశం ఎక్క‌డి నుంచి వ‌చ్చింది అనే కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ప్ర‌స్తుతం అక్క‌డ సోదాలు కొన‌సాగుతున్నాయి. మ‌రోవైపు కోర్టు పరిసరాల్లో భారీగా అదనపు పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేశారు. దీంతో అక్క‌డ టెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Also Read..

Fire Accident | జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు

Actor Ranya Rao | న‌టి ర‌న్యారావుకు మ‌రో షాక్‌.. రూ.102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఛార్జ్‌షీట్‌లో పేరు

NCERT | బాధ్యుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వు.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం

Advertisement
Advertisement