త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bomb Threat | యాప్ ద్వారా ఆటో బుక్ చేసి.. డ్రైవ‌ర్ ఫోన్ నుంచి సీఎం నివాసానికి బాంబు బెదిరింపు

Bomb Threat | యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న ఓ వ్య‌క్తి.. ఆ ఆటో డ్రైవ‌ర్ ఫోన్ ద్వారా ముఖ్య‌మంత్రి నివాసం (CM Residence)తోపాటు విధాన సౌధ‌కు (Vidhana Soudha) బాంబు బెదిరింపు (Bomb Threat) కాల్ చేశాడు.

G

National | Published On Nov 27, 2026, 11.08 am IST

Bomb Threat | యాప్ ద్వారా ఆటో బుక్ చేసి.. డ్రైవ‌ర్ ఫోన్ నుంచి సీఎం నివాసానికి బాంబు బెదిరింపు
Advertisement

Bomb Threat | త్రినేత్ర న్యూస్‌: యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్న ఓ వ్య‌క్తి.. ఆ ఆటో డ్రైవ‌ర్ ఫోన్ ద్వారా ముఖ్య‌మంత్రి నివాసం (CM Residence)తోపాటు విధాన సౌధ‌కు (Vidhana Soudha) బాంబు బెదిరింపు (Bomb Threat) కాల్ చేశాడు. న‌వంబ‌ర్ 5న క‌ర్ణాట‌క‌లోని బెంగ‌ళూరులో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసిన పోలీసులు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

బెంగ‌ళూరుకు చెందిన 26 ఏండ్ల‌ భ‌గ‌వంత్ రాయ్ (Bhagavantharay) ఆటో న‌డుపుతూ జీవ‌నం సాగిస్తున్నాడు. ఈ నెల 5న కార్తీక్ (Karthik) అనే పేరుతో న‌మ్మ యాత్రి యాప్‌లో (Namma Yatri App) రైడ్ బుకింగ్ వ‌చ్చింది. దీంతో మ్యాప్ ఆధారంగా అర‌మ‌నేన‌గర్‌లోని (Aramanenagar) పిక‌ప్ లొకేష‌న్‌కు చేరుకున్నాడు. క‌స్ట‌మ‌ర్ లొకేష‌న్ తెలుసుకునేందుకు భ‌గ‌వంత్.. అత‌నికి ఫోన్ చేశాడు. తాను ముఖ్య‌మంత్రి నివాసంలో ఉన్నాన‌ని, త‌న లొకేషన్ వివరించడానికి వీలుగా గేటు వద్ద ఉన్న ఎవరికైనా ఫోన్ ఇవ్వాలని డ్రైవ‌ర్‌ను కోరాడు. దీంతో భ‌గ‌వంత్ రాయ్ అక్క‌డున్న ఓ పోలీసు అధికారికి త‌న ఫోన్ ఇచ్చాడు. సీఎం నివాసం, విధాన సౌధ వ‌ద్ద బాంబులు పెడ‌తాన‌ని బెదిరించాడు. ముఖ్య‌మంత్రి కాన్వాయ్ (CM Convoy) వెళ్లేట‌ప్పుడు బాంబు పేలుస్తామ‌ని హెచ్చ‌రించాడు.

పోలీసులు వెంట‌నే ఆటోను త‌నిఖీ చేయ‌డం ప్రారంభించారు. తన వాహనాన్ని ఎందుకు తనిఖీ చేస్తున్నారని డ్రైవర్ ప్రశ్నించగా, ముఖ్యమంత్రి నివాసం, విధాన సౌధలో బాంబులు పెడతానని ఆ కాలర్ బెదిరించాడని పోలీసులు తెలిపారు. దీంతో నమ్మ యాత్రి యాప్ ద్వారా తన ఆటోను బుక్ చేసుకున్నాడని, ప్రయాణికుడిని ఎక్కించుకోవడానికి మాత్రమే తాను అక్కడికి వచ్చానని పోలీసుల‌కు చెప్పాడు. బుకింగ్ కన్ఫర్మేషన్ మెసేజ్‌ను కూడా అధికారులకు చూపించి, ఆ వ్యక్తితో తనకు ఎలాంటి ప‌రిచ‌యం లేదని స్పష్టం చేశాడు.

అయితే తన బంధువుకు మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ (Medical Emergency) కార‌ణంగా అత్యవసరంగా వెళ్లాల్సి రావడంతో భగవంతరాయ్ ఆ రోజు ఫిర్యాదు చేయలేకపోయాడు. అనంతరం ఈ నెల 7న త‌న ఆటోను బుక్ చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో తొలుత నాన్-కాగ్నిజబుల్ రిపోర్ట్ (NCR) నమోదు చేసిన పోలీసులు.. కోర్టు అనుమతితో కేసు ఫైల్ చేశారు. నిందితుడిని గుర్తించేందుకు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. అయితే నిందితుడిని ఇప్ప‌టికే అరెస్టు చేసిన‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది.

 

Advertisement
Advertisement