Actor Ranya Rao | నటి రన్యారావుకు మరో షాక్.. రూ.102 కోట్ల గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఛార్జ్‌షీట్‌లో పేరు
Actor Ranya Rao | బంగారం అక్రమ రవాణా కేసులో (Gold Smuggling Case) కన్నడ నటి రన్యారావు (Actor Ranya Rao)కు మరో షాక్ తగిలింది. రూ. 102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్ (ED Chargesheet) దాఖలు చేసింది.
Actor Ranya Rao | దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని (Gold Smuggling Case) తరలిస్తూ అధికారులకు పట్టుబడిన కన్నడ నటి రన్యారావు (Actor Ranya Rao)కు మరో షాక్ తగిలింది. రూ. 102 కోట్ల బంగారం స్మగ్లింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్‌షీట్ (ED Chargesheet) దాఖలు చేసింది. ఇందులో రన్యారావు పేరును కూడా చేర్చింది. దాదాపు 127 కేజీల బంగారాన్ని రన్యారావు సిండికేట్ ముఠా అక్రమంగా తరలించినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బెంగళూరులోని పీఎమ్ఎల్ఏ కోర్టులో ఛార్జ్‌షీటు దాఖలు చేశారు. ఇందులో రన్యారావు పేరుకూడా ఈడీ చేర్చింది. ఆమెతోపాటూ ఆమె సహాయకులు తరుణ్, సాహిల్ పేర్లను కూడా చేర్చింది.
బంగారం స్మగ్లింగ్..
రన్యా రావు దుబాయ్ నుంచి రూ.14 కోట్లకు పైగా విలువైన బంగారం స్మగ్లింగ్ చేస్తూ గతేడాది మార్చిలో బెంగళూరు (Bengaluru) విమానాశ్రయంలో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆమెను అరెస్ట్ చేసిన అనంతరం డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఎస్) అధికారులు లావెల్లె రోడ్‌లోని ఆమె ఇంటిలో సోదాలు నిర్వహించగా రూ.2.06 కోట్ల విలువైన బంగారు నగలు, రూ.2.67 కోట్ల నగదు పట్టుబడ్డాయి. దీంతో పట్టుబడిన మొత్తం నగదు, బంగారం విలువ 17.29 కోట్లుగా అధికారులు నిర్ధారించారు. విచారణలో భాగంగా రన్యారావు కీలక విషయాలు వెల్లడించింది. తాను దుబాయ్ నుంచి 17 బంగారు కడ్డీలను తీసుకుని వచ్చినట్టు ఆమె రెవెన్యూ అధికారులకు తెలిపింది. తాను దుబాయే కాక మధ్య ప్రాచ్య, యూరప్, అమెరికా, సౌదీ అరేబియా దేశాలు పర్యటించినట్టు తెలిపింది. దుబాయ్ నుంచి ఆమె బంగారాన్ని తెచ్చినందుకు కేజీకి రూ.4 నుంచి రూ.5 లక్షలు తీసుకుంటుందని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక ఈ కేసులో ఆమెకు ఏడాది జైలు శిక్ష పడిన విషయం తెలిసిందే. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఇప్పటికే ఆమెకు రూ. 102 కోట్ల జరిమానా కూడా విధించింది.
తాజావార్తలు
- ●Harish Rao | రేవంత్.. పాలిటెక్నిక్ పిల్లలను కలిస్తే నీకేం నొప్పి.. వాళ్లేమైనా టెర్రరిస్టులా?
- ●Sara Arjun | మౌనరాగం సీరియల్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరోయిన్ తెలుగు మూవీ
- ●Crime News | భర్త సిగరెట్ తాగొస్తానని వెళ్లాడు.. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి భార్య!
- ●Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు
- ●Niranjan Reddy | కాంగ్రెస్ మోసాలతో అన్ని వర్గాలూ నష్టపోయాయి
- ●Mallikarjun Kharge | డీలిమిటేషన్‌పై చర్చించేందుకు ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టండి.. ప్రధాని మోదీకి ఖర్గే లేఖ

Harish Rao | రేవంత్.. పాలిటెక్నిక్ పిల్లలను కలిస్తే నీకేం నొప్పి.. వాళ్లేమైనా టెర్రరిస్టులా?

Sara Arjun | మౌనరాగం సీరియల్ డైరెక్టర్‌తో ధురంధర్ హీరోయిన్ తెలుగు మూవీ

Crime News | భర్త సిగరెట్ తాగొస్తానని వెళ్లాడు.. ఎంతకీ తిరిగి రాకపోయేసరికి భార్య!

Sai Pallavi | సాయిపల్లవి రిజెక్ట్ చేసిన మలయాళ సినిమాతో హిట్టు కొట్టిన మమితా బైజు






