NCERT | బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు.. ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యపుస్తకంపై సుప్రీంకోర్టు నిషేధం
NCERT | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ (corruption in the judiciary) అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. అవినీతికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్న ఈ పుస్తకం పంపిణీని నిషేధించింది.
NCERT | నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) 8వ తరగతి సాంఘిక శాస్త్రంలో ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ (corruption in the judiciary) అంశంపై పాఠ్యాంశాలను చేర్చడాన్ని సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు దీనిపై సుమోటోగా విచారణ చేపట్టింది. సీజేఐ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం న్యాయవ్యవస్థలో అవినీతికి సంబంధించిన ప్రస్తావనలు ఉన్న ఈ పుస్తకం పంపిణీని నిషేధించింది.
ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ఉల్లంఘించి ఎలక్ట్రానిక్ పింపిణీ లేదా టైటిల్స్ మార్చి బుక్‌ను పంపిణీ చేసే ప్రయత్నాలు చేసినా కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించినట్లుగానే పరిగణిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రచురణ, డిజిటల్ పంపిణీపై పూర్తిస్థాయి నిషేధాన్ని విధించింది. విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థ యొక్క సమగ్రతను కించపరిచేలా లేదా దిగజార్చేలా చేసే ఏ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు అనుమతించదని హెచ్చరించారు.
"వాళ్లు ప్రయోగించిన బుల్లెట్‌తో న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన చర్యగా అనిపిస్తోంది. దీనిపై మేము లోతైన విచారణ కోరుకుంటున్నాము. దీనికి బాధ్యులు ఎవరో మేము తెలుసుకోవాలి. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు" అని దర్మాసనం హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం, ఎన్‌సీఈఆర్‌టీ చైర్మన్ ప్రొఫెసర్ దినేష్ ప్రసాద్ సక్లానీకి కోర్టు నోటీసులు జారీ చేసింది.
ఇక ఈ వ్యవహారాన్ని తాము సమర్థించుకోవడం లేదని ప్రభుత్వం తరఫున వాదినలు వినిపిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి తెలియజేశారు. న్యాయవ్యవస్థకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని తెలిపారు. మరోవైపు విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానానినికి కేంద్రం బేషరతుగా క్షమాపణలు చెప్పింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్






