త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fire Accident | జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు

Fire Accident | హైద‌రాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ (Jubilee Hills )లోని మంగ‌ళ‌గౌరి (Mangalagouri) వ‌స్త్ర దుకాణంలో గురువారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి (Fire Accident).

D

Telangana | Published On Feb 26, 2026, 12.48 pm IST

Fire Accident | జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్ర‌మాదం.. ఎగ‌సిప‌డుతున్న మంట‌లు
Advertisement

Fire Accident | హైద‌రాబాద్ (Hyderabad) జూబ్లీహిల్స్ (Jubilee Hills)లో భారీ అగ్నిప్ర‌మాదం (Fire Accident) సంభ‌వించింది. జూబ్లీహిల్స్ మెట్రో స్టేష‌న్ స‌మీపంలో మెయిన్ రోడ్డుకు ఆనుకుని ఉన్న మంగ‌ళ‌గౌరి (Mangalagouri) వ‌స్త్ర దుకాణంలో గురువారం ఉద‌యం మంట‌లు చెల‌రేగాయి. క్ష‌ణాల్లోనే మంట‌లు భారీ ఎత్తున‌ ఎగ‌సి ప‌డ్డాయి. అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు వెంట‌నే పోలీసుల‌కు, అగ్నిమాప‌క సిబ్బందికి స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న అగ్నిమాప‌క సిబ్బంది మంటల‌ను అదుపులోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ప్ర‌ధాన ర‌హ‌దారిపైనే దుకాణం ఉండ‌టంతో ఈ ప్ర‌మాదం నేప‌థ్యంలో ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంత‌రాయం ఏర్ప‌డింది.

Advertisement
Advertisement