Telangana | బీర్లు తాగేస్తున్నారు.. గత 15 రోజుల్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు
Telangana | ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రంలో (Telangana) బీర్ల అమ్మకాలు (Beer Sales) భారీగా పెరిగాయి. మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు (Summer) నమోదవుతుండటంతో మద్యం ప్రియులు చల్లటి బీర్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు.
Telangana | త్రినేత్ర.న్యూస్: ఎండాకాలం ఇంకా ప్రారంభం కాకముందే రాష్ట్రంలో (Telangana) బీర్ల అమ్మకాలు (Beer Sales) భారీగా పెరిగాయి. మధ్యాహ్నం సమయంలో అధిక ఉష్ణోగ్రతలు (Summer) నమోదవుతుండటంతో మద్యం ప్రియులు చల్లటి బీర్లు తాగుతూ ఉపశమనం పొందుతున్నారు. దీంతో గత ఐదేండ్ల రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. 2024లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరగగా, ఇప్పుడు వాటిని తిరగరాసేలా అమ్మకాలు కొనసాగుతున్నాయి. గత 15 రోజుల్లోనే బీర్ల అమ్మకాలు 36 శాతం మేర పెరగడం విశేషం.
రాష్ట్ర వ్యాప్తంగా 2,620 మద్యం దుకాణాలు, 1,205 బార్లు, 50కిపైగా క్లబ్బులు ఉండగా.. ఈ నెల మొదటి నాలుగు రోజుల్లోనే 8 లక్షల కేసులకుపైగా విక్రయాలు జరిగాయి. 2025 జనవరిలో 31 లక్షల కేసుల బీర్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది అది 34 లక్షలకు పెరిగింది. ఇక, గతేడాది ఫిబ్రవరిలో 28 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా.. 2026 ఫిబ్రవరిలో ఆ సంఖ్య 38లక్షలకు చేరింది. ఫిబ్రవరి నెల మధ్య నుంచే సూర్యుడు ప్రతాపం చూపిస్తుండటంతో బీర్లకు డిమాండ్ పెరిగిందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు.
2025 మార్చిలో 31లక్షల కేసులు అమ్మగా.. ఈ సారి నాలుగు రోజుల్లోనే అందులో నాలుగో వంతు (8లక్షల కేసులు)ను చేరుకోవడం విశేషం. ఎండలు పెరిగే కొద్దీ ఈ అమ్మకాల సంఖ్య మరింత అధికమయ్యే అవకాశం ఉందని అధికారులు వెళ్లడించారు.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్‌లో అంగరంగ వైభవంగా 'విరోష్' వెడ్డింగ్ రిసెప్షన్.. కనువిందు చేస్తున్న విజయ్-రష్మికల జోడీ!
భారత్ నుంచి వెళ్తుండగా ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి.. హిందూ మహాసముద్రంలో 80 మంది జలసమాధి
లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత గణపతి?
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ హవా..! ప్రమాదంలో అభిషేక్ నెంబర్ వన్ ర్యాంక్..!
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



