త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ హ‌వా..! ప్ర‌మాదంలో అభిషేక్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌..!

ICC Rankings | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌ని బుధ‌వారం విడుద‌ల చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ అభిషేక్ శ‌ర్మ నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం టాప్ ప్లేస్‌లోనే ఉన్నా పాక్ బ్యాట్స్‌మెన్ సాహిబ్జాదా ఫ‌ర్హాన్ చేరువ‌య్యాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంస‌న్ ర్యాంకును మెరుగుప‌రుచుకున్నాడు.

P

Sports | Published On Mar 4, 2026, 8.48 pm IST

ICC Rankings | ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ హ‌వా..! ప్ర‌మాదంలో అభిషేక్ నెంబ‌ర్ వ‌న్ ర్యాంక్‌..!
Advertisement

ICC Rankings | ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) తాజాగా మెన్స్ టీ20 ర్యాంకింగ్స్‌ని బుధ‌వారం విడుద‌ల చేసింది. టీమిండియా బ్యాట్స్‌మెన్ అభిషేక్ శ‌ర్మ నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. ప్ర‌స్తుతం టాప్ ప్లేస్‌లోనే ఉన్నా పాక్ బ్యాట్స్‌మెన్ సాహిబ్జాదా ఫ‌ర్హాన్ చేరువ‌య్యాడు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడిన సంజు శాంస‌న్ ర్యాంకును మెరుగుప‌రుచుకున్నాడు.

ప్ర‌మాదంలో శ‌ర్మ ర్యాంక్‌..

అభిషేక్ శర్మ టీ20 బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో 874 రేటింగ్ పాయింట్లతో టాప్ వ‌న్‌లో ఉన్నాడు. సాహిబ్‌జాదా ఫర్హాన్ అత‌నికంటే కేవలం 26 పాయింట్ల తేడాతో వెనుక ఉన్నాడు. ఫర్హాన్ ఖాతాలో 848 పాయింట్ల‌తో రెండోస్థానానికి చేరాడు. అభిషేక్ శ‌ర్మ గ‌తేడాది జులైలో ట్రావిస్ హెడ్‌ను వెన‌క్కి నెట్టి తొలిసారిగా నెంబ‌ర్ వ‌న్ ప్లేస్‌కి చేరిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత యూఏఈలో జ‌రిగిన ఆసియా క‌ప్ స‌మ‌యంలో 931 రేటింగ్ పాయింట్ల‌తో స‌రికొత్త చ‌రిత్ర‌ను సృష్టించాడు. టీ20 చ‌రిత్ర‌లో అత్య‌ధిక రేటింగ్ పాయింట్స్ కావ‌డం విశేషం. డేవిడ్ మ‌లాన్ ఇది టీ20 ఇంటర్నేషనల్‌లో ఎప్పుడైనా వచ్చిన అత్యధిక రేటింగ్‌గా నిలువ‌గా.. అంత‌కు ముందు డేవిడ్ మాలాన్ 919 పాయింట్ల రికార్డును బ్రేక్ చేశాడు.

ఆరు మ్యాచుల్లో 80 ప‌రుగులే..

టీ20 వరల్డ్ కప్‌లో అభిషేక్ ప‌రుగులు చేయ‌డంలో ఇబ్బందిప‌డుతున్నాడు. ఆడిన ఆరు మ్యాచుల్లో కేవ‌లం 80 ప‌రుగులు మాత్ర‌మే చేయ‌గ‌లిగాడు. 13.33 స‌గ‌టు, 131.14 స్ట్ర‌యిక్ రేట్ మాత్ర‌మే సాధించాడు. టోర్నీలో వ‌రుస‌గా మూడు మ్యాచుల్లో డ‌కౌట్ అయ్యాడు. న‌మీబియాతో మ్యాచ్ స‌మ‌యంలో క‌డుపు నొప్పి కార‌ణంగా మ్యాచ్‌కు దూర‌మ‌య్యాడు. జింబాబ్వేతో జ‌రిగిన మ్యాచుల్లో 30 బంతుల్లో 55 ప‌రుగులు చేసి మ‌ళ్లీ ట‌చ్‌లోకి వ‌చ్చాడు. వెస్టిండీస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో అదే ఫామ్‌ను కొన‌సాగించ‌లేక‌పోయాడు. సెమీ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగే మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడాల‌ని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

రెండో స్థానంలో ఫ‌ర్హాన్‌..

పాకిస్తాన్ సెమీ ఫైన‌ల్‌కు చేర‌లేక‌పోయినా ఫర్హాన్ టోర్నీలో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఆరు ఇన్నింగ్స్‌లో 383 పరుగులు చేశాడు. సూపర్-8లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును బ్రేక్ చేశాడు. గ‌తంలో ఈ రికార్డు విరాట్ పేరిట ఉండేది. ఫర్హాన్ ఈ వరల్డ్ కప్‌లో ఒకే ఎడిషన్‌లో రెండు శతకాలు సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. నమీబియా, శ్రీలంకతో మ్యాచుల్లో శతకాలు సాధించాడు. అయితే, భారత్‌తో మ్యాచ్‌లో డక్ అయ్యాడు.

దూసుకొచ్చిన శాంస‌న్‌..

టీమిండియా ఓపెన‌ర్ సంజు శాంస‌న్ ఐసీసీ ర్యాంకింగ్‌లో దూసుకొచ్చాడు. వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో 97 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. కేర‌ళ కుర్రాడి అద్భుత ఇన్నింగ్స్ కార‌ణంగా టీమిండియా సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఇన్నింగ్స్ కార‌ణంగా 25 స్థానాలు మెరుగుప‌రుచుకొని 40వ స్థానానికి చేరుకున్నాడు. కోల్‌క‌తా వేదిక‌గా జ‌రిగిన ఈ మ్యాచ్‌లో శాంస‌న్ 50 బంతుల్లో అజేయంగా 97 ప‌రుగుల‌తో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 12 ఫోర్లు, నాలుగు సిక్స‌ర్లు ఉన్నాయి. టీమిండియా 196 ప‌రుగులు ల‌క్ష్యాన్ని ఛేదించి.. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు ఛేజ్ చేసిన జ‌ట్టుగా నిలిచింది.

ఏడో స్థానంలో బుమ్రా..

బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో అభిషేక్ నెంబ‌ర్ వ‌న్‌గా కొన‌సాగుతుండ‌గా.. ఫ‌ర్హాన్ రెండోస్థానంలో ఉన్నాడు. ఫిల్ సాల్ట్ (ఇంగ్లండ్‌), ఇశాన్ కిష‌న్ (భార‌త్‌), సూర్య‌కుమార్ యాద‌వ్ (భార‌త్‌), డేవాల్డ్ బ్రేవిస్ (ద‌క్షిణాఫ్రికా), జోస్ బ‌ట్ల‌ర్ (ఇంగ్లండ్‌), టిమ్ సిఫెర్ట్ (న్యూజిలాండ్‌) ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. బౌల‌ర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి నెంబ‌ర్ వ‌న్ బౌల‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. ర‌షిద్ ఖాన్ (అఫ్ఘ‌నిస్తాన్‌), అబ్రార్ అహ్మ‌ద్ (పాక్‌), కార్బిన్ బాష్ (ద‌క్షిణాఫ్రికా), ఆదిల్ ర‌షీద్ (ఇంగ్లండ్‌) ఆ త‌ర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీమిండియా స్టార్ బౌల‌ర్ జ‌స్‌ప్రీత్ బుమ్రా 7వ స్థానంలో ఉన్నాడు. మ‌రో బౌల‌ర్ అర్ష్‌దీప్ సింగ్ 13వ స్థానానికి చేరాడు. ఆల్‌రౌండ్ల ర్యాంకింగ్స్‌లో జింబాబే ప్లేయ‌ర్ సికింద‌ర్ ర‌జా నెంబ‌ర్ వ‌న్‌గా, టీమిండియా ఆల్‌రౌండ‌ర్ పాండ్యా రెండోస్థానంలో ఉన్నాడు.

Advertisement
Advertisement