త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Bhagirath | బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండు.. చర్లపల్లి జైలుకు తరలింపు

Bandi Bhagirath | పోక్సో కేసులో నిందితుడు, కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమారుడు బండి భగీరథ్‌ను (Bandi Bhagirath) శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగి అప్పా జంక్ష‌న్‌లోని పోలీసు అకాడ‌మీ వ‌ద్ద ఎస్‌వోటీ పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు.

G

Telangana | Published On May 17, 2026, 6.33 am IST

Bandi Bhagirath | బండి భగీరథ్‌కు 14 రోజుల రిమాండు.. చర్లపల్లి జైలుకు తరలింపు
Advertisement

Bandi Bhagirath | త్రినేత్ర‌.న్యూస్‌: పోక్సో కేసులో (POCSO Case) నిందితుడు, కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమారుడు బండి భగీరథ్‌ను (Bandi Bhagirath) శనివారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. నార్సింగి అప్పా జంక్ష‌న్‌లోని పోలీసు అకాడ‌మీ వ‌ద్ద ఎస్‌వోటీ పోలీసులు అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అనంత‌రం కూక‌ట్‌ప‌ల్లి డీసీపీ రితిరాజ్ సుమారు 2.30 గంట‌ల పాటు భ‌గీర‌థ్‌ను విచారించారు. రాత్రి 11.35 గంట‌ల‌కు మేడ్చ‌ల్ ప్ర‌భుత్వ ద‌వాఖాన‌లో వైద్య‌ప‌రీక్ష‌ల నిమిత్తం త‌ర‌లించారు. ఆ త‌ర్వాత నిందితుడిని మేడ్చ‌ల్‌లోని మేజిస్ట్రేట్ నివాసంలో హాజ‌రుప‌రిచారు. విచార‌ణ అనంత‌రం అతనికి 14 రోజుల జ్యుడీషియ‌ల్‌ రిమాండ్‌ విధించారు. దీంతో భ‌గీర‌థ్‌ను చ‌ర్ల‌ప‌ల్లి జైలుకు త‌ర‌లించారు. ముందస్తు బెయిలు, అరెస్టు నుంచి రక్షణకు హైకోర్టు నిరాక‌రించిన మ‌రునాడే ఇది చోటుచేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

చ‌ట్టంముందు అంద‌రూ స‌మాన‌మే: బండి సంజ‌య్‌

భ‌గీర‌థ్‌ను న్యాయ‌వాదుల స‌మ‌క్షంలో పోలీసుల ఎదుట హాజ‌రుప‌రిచిన‌ట్లు కేంద్ర‌మంత్రి బండి సంజ‌య్ వివ‌రించారు. తన కుమారుడు భగీరథ్‌ను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించారు. అడ్వకేట్ల ద్వారా విచారణకు సహకరించేలా పోలీసుల ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. “చట్టం ముందు నా కుమారుడైనా, సాధారణ వ్యక్తైనా ఒక్కటే. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలి. మా అబ్బాయి ఏ తప్పూ చేయలేదని పదేపదే చెబుతున్నాడు. వాస్తవానికి ఫిర్యాదు రాగానే అతన్ని స్టేషన్‌లో అప్పగిద్దామనుకున్నా.

లాయర్లను సంప్రదించి మా వద్ద ఉన్న ఆధారాలను వారి ముందుంచాడు. వాటిని చూసి కేసు కొట్టేస్తారని, బెయిల్‌ తప్పకుండా వస్తుందని న్యాయవాదులు చెప్పారు. అందుకే కొంత జాప్యం జరిగింది. ఇప్పటికీ బెయిల్‌ వస్తుందనే లాయర్లు చెబుతున్నారు. సోమవారం కోర్టు ఉత్తర్వులు వెలువడే అవకాశమున్నప్పటికీ, ఇంకా జాప్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో నేను మా అబ్బాయిని తీసుకొచ్చి విచారణ కోసం లాయర్ల ద్వారా పోలీసులకు అప్పగించా’’ అని వివరించారు.

ఇవి కూడా చ‌ద‌వండి..

పోక్సో కేసులో కీల‌క ప‌రిణామం.. పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భ‌గీర‌థ్‌

వెండి దిగుమతులపై కేంద్రం సంచలన నిర్ణయం: 'ఫ్రీ' నుంచి 'రెస్ట్రిక్టెడ్' జాబితాలోకి.. పెరిగిన కస్టమ్స్ డ్యూటీ!

ప్రాణాలకు తెగించి పోరాడిన సిబ్బంది.. జ్యువెలరీ షాపులో దొంగలకు చుక్కలు.. VIDEO

Advertisement
Advertisement