POCSO Case | పోక్సో కేసులో కీలక పరిణామం.. పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్
POCSO Case | తెలంగాణలో సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పోక్సో కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
POCSO Case | తెలంగాణలో సర్వత్రా చర్చనీయాంశంగా మారిన పోక్సో కేసులో శనివారం కీలక పరిణామం చోటు చేసుకుంది. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట హాజరయ్యాడు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి వరకు హైకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ జరిపింది. పోలీసులు, భగీరథ్ తరఫున సీనియర్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అరెస్టు చేయకుండా పోలీసులకు ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేయగా.. ధర్మాసనం నిరాకరించింది.
ఇప్పటికే పలుసార్లు పోలీసులు విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేయగా.. హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలినట్లయ్యింది. మరో వైపు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి.. భగీరథ్ ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నోటీసులు ఇచ్చినా హాజరుకాకపోవడంతో పోలీసులు కరీంనగర్, హైదరాబాద్, ఢిల్లీ ప్రాంతాల్లో గాలించారు. దేశం విడిచి పారిపోకుండా పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ క్రమంలో న్యాయవాదుల సలహా మేరకు చివరకు భగీరథ్‌ను వారి సమక్షంలోనే పోలీసుల ఎదుట లొంగిపోయాడు. మైనర్ బాలిక ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
చట్టంముందు అందరూ సమానమే : బండి సంజయ్
భగీరథ్‌ను న్యాయవాదుల సమక్షంలో పోలీసుల ఎదుట హాజరుపరిచినట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ వివరించారు. తన కుమారుడు భగీరథ్‌ను చట్టపరమైన ప్రక్రియలో భాగంగా పోలీసులకు అప్పగించినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వెల్లడించారు. అడ్వకేట్ల ద్వారా విచారణకు సహకరించేలా పోలీసుల ఎదుట హాజరుపరిచినట్లు చెప్పారు. “చట్టం ముందు నా కుమారుడైనా, సాధారణ వ్యక్తైనా ఒక్కటే. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలి” అని బండి సంజయ్ స్పష్టం చేశారు. తన కుమారుడు తాను ఎలాంటి తప్పూ చేయలేదని పదేపదే చెబుతున్నాడన్నారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేసీఆర్ ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు..? బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ ప్రశ్న
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



