త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజ‌రు కావాలంటే!

Bandi Bhagirath | బాలిక‌ను వేధించిన కేసులో బండి భ‌గీర‌థ్‌(Bandi Bhagirath)కు మేడ్చ‌ల్ పోక్సో కోర్టు (Medchal POCSO Court) గురువారం నోటీసులు (Notices) జారీ చేసింది.

S

Telangana | Published On Nov 26, 2026, 4.46 pm IST

Bandi Bhagirath | బండి భగీరథ్‌కు నోటీసులు జారీ చేసిన మేడ్చల్ పోక్సో కోర్టు.. ఎప్పుడు హాజ‌రు కావాలంటే!
Advertisement

Bandi Bhagirath | త్రినేత్ర న్యూస్: బాలిక‌ను వేధించిన కేసులో బండి భ‌గీర‌థ్‌(Bandi Bhagirath)కు మేడ్చ‌ల్ పోక్సో కోర్టు (Medchal POCSO Court) గురువారం నోటీసులు (Notices) జారీ చేసింది. వ‌చ్చే జ‌న‌వ‌రి 28న కోర్టులో హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. దీంతో భ‌గీర‌థ్ త‌ప్ప‌నిస‌రిగా కోర్టులో హాజ‌రు కావాల్సి ఉంది.

ఇదీ కేసు క‌థ‌..

ఈ ఏడాది మే నెల‌లో ఓ బాలిక (17)ను వేధించి, మద్యం తాగించి శారీరకంగా ఇబ్బందులకు గురిచేశారంటూ బాధితురాలి తల్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోక్సో, బీఎన్ఎస్ సెక్షన్లతో పాటు ఆధారాల తారుమారు అభియోగాలను పోలీసులు ఈ కేసులో చేర్చారు. అనంత‌రం మే 16న భగీరథ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ నేప‌థ్యంలో నిందితుడు బెయిల్ కోసం తెలంగాణ‌ హైకోర్టును ఆశ్ర‌యించ‌గా జూలైలో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తాజాగా విచారణ నిమిత్తం జనవరి 28న పోక్సో కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Advertisement