Komatireddy Venkat Reddy | నా ప్లాన్ ప్రకారం పోతే 100 సీట్లకు పైగా గెలుస్తం
Komatireddy Venkat Reddy | తన ప్లాన్ ప్రకారం పోతే వచ్చే ఎన్నికల్లో (Next Elections) 100 సీట్లకు పైగా గెలుస్తామని.. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు.
- కాంగ్రెస్‌పై ఏం వ్యతిరేకత లేదు.. వచ్చే ఎన్నికల ఫలితాలతో మీకు అర్థమైతది
- గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు కచ్చితంగా గెలుస్తం
- కష్టపడ్డవారికే పదవులివ్వాలని బీఎం సందీప్‌తో చెప్తా
- నితిన్ నబీన్, అమిత్ షా ఏ మొహం పెట్టుకొని వస్తున్నరు
- గాంధీ భవన్ మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
Komatireddy Venkat Reddy | త్రినేత్ర న్యూస్: తన ప్లాన్ ప్రకారం పోతే వచ్చే ఎన్నికల్లో (Next Elections) 100 సీట్లకు పైగా గెలుస్తామని.. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల ఫలితాలతో అందరికీ అర్థమవుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కచ్చితంగా గెలిచితీరుతామని చెప్పారు. కష్టపడ్డవారికే పదవులు ఇవ్వాలని బీఎం సందీప్‌కుమార్ (BM Sandip Kumar) తో చెప్తానని పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏ మొహం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని ఎద్దేవా చేశారు.
బీజేపీ పార్టీ కేంద్రంలో ఉండి తెలంగాణకు ఏం చేసిందో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ చెప్పాలి. ఆర్ఆర్ఆర్ (RRR) ఎందుకు పెండింగ్‌లో పెట్టారో చెప్పాలి. గడ్కరీతో మాట్లాడి ఇప్పిస్తే RRR కేబినెట్ లో పెట్టకుండా పెండింగ్‌లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీపై ఎలాంటి వ్యతిరేకత లేదు. వచ్చే ఎన్నికల్లో 90 సీట్లు కచ్చితంగా వస్తాయి.
గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిపించుకోవడమే లక్ష్యంగా ముందుకు పోతాం. కచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు గెలుస్తాం
కష్టపడి పార్టీలో పనిచేసే వారికి పదవులు ఇవ్వాలని ఇంచార్జీతో చర్చిస్తాను. ఓటు చోరీ జరుగుతుందని ఉత్తర్ ప్రదేశ్ బీజేపీ సీఎం అన్నారు అని వెంకట్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Bullion Market | ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!
- ●CM Yogi Adityanath | సన్యాసిగా తల్లివద్ద భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి
- ●BRS Party | పల్నాడు ప్రాజెక్టును అడ్డుకోవాలి
- ●NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ
- ●Jagadish Reddy | బీఆర్ఎస్ నేతల అరెస్టులపై జగదీశ్‌రెడ్డి ఫైర్
- ●Srisailam Temple | శ్రీశైలంలో భక్తజన సందోహం.. అభిషేకాలు, స్పర్శ దర్శనాలు నిలిపివేత!

Bullion Market | ఐదురోజుల నష్టాలకు బ్రేక్.. మళ్లీ పుంజుకున్న పసిడి, వెండి..!

CM Yogi Adityanath | సన్యాసిగా తల్లివద్ద భిక్షాటన.. భావోద్వేగానికి గురైన సీఎం యోగి

BRS Party | పల్నాడు ప్రాజెక్టును అడ్డుకోవాలి

NCERT | పాఠ్యపుస్తకాల నాసిరకం ముద్రణపై NCERT సీరియస్.. బాధ్యులపై కఠిన చర్యలకు హామీ





