Bandi Sanjay | మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్..
Bandi Sanjay | ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. నువ్వెన్ని డ్రామాలాడినా, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేసినా తగ్గేదేలేదని అన్నారు.
నువ్వెన్ని డ్రామాలాడిన తగ్గేదేలే
ప్రజల పొట్ట కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా..?
పప్పూ...ఇగ మీ పప్పులుడకవ్
రాహుల్ గాంధీని హెచ్చరించిన బండి సంజయ్
Bandi Sanjay | త్రినేత్ర న్యూస్ : ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులాంటోడు.. టచ్ చేస్తే మాడి మసైపోతావ్ అని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హెచ్చరించారు. నువ్వెన్ని డ్రామాలాడినా, విదేశీ శక్తులతో కలిసి కుట్రలు చేసినా తగ్గేదేలేదని అన్నారు. విదేశీ అక్రమ వలసదారులు ఓట్లు, రేషన్ కార్డులు పొంది ఇక్కడి ప్రజల పొట్ట కొడుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని అడిగారు. విదేశీ చొరబాటుదారులకు ఈ దేశ ప్రధాని, సీఎంలను నిర్ణయించే అధికారం ఎవరిచ్చారు..? అని బండి సంజయ్ నిలదీశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన బీజేపీ మహా పాదయాత్రలో బండి సంజయ్ పాల్గొని ప్రసంగించారు.
కరీంనగర్‌లో కాషాయ దళ ప్రభంజనాన్ని చూసి నన్ను కన్న ఈ కరీంనగర్ గడ్డ ఉరకలేస్తోంది. ఈ ప్రభంజనాన్ని చూసి నా మనసు పులకరిస్తోంది. నితిన్ నబీన్ కరీంనగర్ గడ్డపై అడుగు పెట్టినంక నా గుండె ఉప్పొంగుతోంది. నమ్మిన సిద్దాంతం కోసం, భుజం మీదనున్న కాషాయ జెండా తెగించి కొట్లాడతానంటుంది. కరీంనగర్ నా కాషాయ అడ్డా అని తొడగొట్టి సవాల్ విసరాలని ఉంది. తెలంగాణలో బీజేపీ యాడ ఉందన్న కాంగ్రెస్ నేతల్లారా.. ఇక్కడి ప్రభంజనాన్ని చూడండి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టడానికి కాషాయ దళం ఎట్లా ఉరకలేస్తోందో చూడండి అని బండి సంజయ్ పేర్కొన్నారు.
నితిన్ నబిన్ కొదమ సింహం
నితిన్ నబిన్ కొదమ సింహం. నబిన్ చూపుల్లో ‘వాడి’ ఉంది.. పక్కన నిలబడితే ‘వేడి’ తగులుతోంది. నితిన్ అంటే నిజాయితీ, నైతికత.. నబీన్ అంటే నూతనత్వం. నిజాయితీతో కష్టపడుతూ నూతనత్వంతో పార్టీని ఉరకలేయిస్తున్న నితిన్ ఆషామాషీ లీడర్ కాదు. 25 ఏళ్లకే ఎమ్మెల్యే కావడంతోపాటు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర నితిన్ నబీన్‌ది. 45 ఏళ్లకే ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పార్టీకి అధ్యక్షుడైన ఘనత నితిన్ సొంతం. ఒక సామాన్య కార్యకర్త ఇవాళ బీజేపీని నడిపిస్తున్నడంటే ఇది మామూలు విషయం కాదు. నితిన్‌కు స్కూల్ డేస్‌లో రాజకీయాలంటే ఇష్టం లేదు. ఉన్నత విద్య చదివి మంచి పొజిషన్‌లో ఉండాలనుకున్నారు. ఆర్ఎస్ఎస్ నేర్పిన క్రమశిక్షణ, నిబద్దత, నిజాయితీ, దేశం కోసం ధర్మం కోసం అంకిత భావమే ఈ స్థాయిలో నిలబెట్టింది. కాషాయ కండువా కప్పుకున్న ప్రతి కార్యకర్త, నాయకుడు ఇదే సంకల్పంతో పని చేస్తున్నారు అని సంజయ్ తెలిపారు.
అధికారం కోసం కార్యకర్తలు చేస్తున్న పోరాటం మామూలుది కాదు
తెలంగాణల అధికారం కోసం ఏళ్ల తరబడి నా బీజేపీ కార్యకర్తలు చేస్తున్న పోరాటం మామూలుది కాదు. కాషాయ జెండా మోసి మోసి కార్యకర్తల భుజాలు కాయలు కాసినయ్. లాఠీ దెబ్బలు తిని ఒళ్లంతా గిర్రలు గీసినయన్నా.. అయినా నా బీజేపీ కార్యకర్త ఎన్నడూ భయపడలేదన్నా అని ఆయన స్పష్టం చేశారు.
కోటి మంది డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే తప్పేంది?
రాహుల్ గాంధీ ‘‘సర్’’తో మీకొచ్చిన నష్టమేంది? చచ్చిపోయిన 3 కోట్ల మంది ఓట్లను తొలగిస్తే తప్పేంది? మాజీ ప్రధాని పీవీ, పీసీసీ మాజీ చీఫ్ ఎమ్మెస్సార్ చనిపోయి ఏళ్లు గడుస్తున్నా ఓట్లు తొలగించలేదు. 2014కు ముందు అక్రమంగా దేశంలోకి వలస వచ్చిన 4 కోట్ల మంది ఓట్లను తీసేస్తే మీకొచ్చిన నొప్పేంది? శాశ్వతంగా వలస వెళ్లిన 6 కోట్ల మంది ఓట్లను తీసేస్తే మీకొచ్చిన నష్టమేంది? కోటి మంది డూప్లికేట్ ఓట్లను తొలగిస్తే తప్పేంది? 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడికి ఓటు హక్కు కల్పిస్తే మీకొచ్చిన బాధేంది? బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుండి వలస వచ్చిన ఓట్లతో గెలవాలని కాంగ్రెస్ అనుకుంటుందా..? పప్పూ...ఇగ మీ పప్పులుడకవ్ అని హెచ్చరించారు.
అందరికీ ఇచ్చారు అధికారం... బీజేపీకి ఇవ్వండి అవకాశం
డ్రగ్స్ బారిన పడి యువత అల్లాడుతుంటే మోదీ కంట తడి పెట్టారు. నషా ముక్త్ భారత్ పేరుతో డ్రగ్స్ రహిత సమాజం కోసం పనిచేస్తున్నారు. మోదీకి అండగా నిలుద్దాం. కాంగ్రెస్ పార్టీకి 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయనడం పెద్ద జోక్. ఏం చేశారని మీకు అన్ని సీట్లు వస్తాయి. ఇచ్చిన హామీలను అమలు చేయని కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలి. అందరికీ ఇచ్చారు అధికారం... బీజేపీకి ఇవ్వండి అవకాశం అని బండి సంజయ్ కోరారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే
- ●Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!
- ●Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్
- ●Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు
- ●Etala Rajendar | రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు అమ్మనివ్వం.. అవి ప్రజావసరాలకే ఉండాలి
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. రూ.6.39 లక్షల కోట్ల సంపద ఆవిరి..

Ayodhya To Janakpur | ఇక అయోధ్య నుంచి జనక్పూర్కి నేరుగా రైలు సర్వీసు.. కీలక వివరాలు ఇవే

Shubman Gill | సలైవా వాడకంపై బ్యాన్ ఎత్తేయండి.. ఐసీసీకి గిల్ రిక్వెస్ట్..!

Telangana Gold Man IT Raid | తెలంగాణ 'గోల్డ్ మ్యాన్' కేసులో ఐటీ శాఖ కొరడా: రాయదుర్గంలో రూ.3.2 లక్షల అద్దె వచ్చే బినామీ భవనం అటాచ్

Motkupalli Narasimhulu | రేవంత్ రెడ్డికి దళితులంటే చులకన భావం : మోత్కుపల్లి నర్సింహులు





