త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kuldeep Yadav | స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ హ‌ల్దీ ఫంక్ష‌న్‌.. డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్న చాహ‌ల్‌

Kuldeep Yadav | టీమిండియా స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ (Kuldeep Yadav) వివాహ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. నేడు వంశిక చద్దా (Vanshika Chadha)ను కుల్దీప్ వివాహం చేసుకోనున్నాడు. ఇందులో భాగంగా నిన్న ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ముస్సోరీ (Mussoorie)లో హ‌ల్దీ, మెహందీ వేడుక‌లు జ‌రిగాయి.

D

Sports | Published On Mar 14, 2026, 11.11 am IST

Kuldeep Yadav | స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ హ‌ల్దీ ఫంక్ష‌న్‌.. డ్యాన్స్‌తో ఆక‌ట్టుకున్న చాహ‌ల్‌
Advertisement

Kuldeep Yadav | టీమిండియా స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ (Kuldeep Yadav) వివాహ వేడుక‌లు ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. నేడు వంశిక చద్దా (Vanshika Chadha)ను కుల్దీప్ వివాహం చేసుకోనున్నాడు. ఇందులో భాగంగా నిన్న ఉత్తరాఖండ్ (Uttarakhand)లోని ముస్సోరీ (Mussoorie)లో హ‌ల్దీ, మెహందీ వేడుక‌లు జ‌రిగాయి. ఈ వేడుక‌ల‌కు ప‌లువురు స్టార్ క్రికెటర్లు హాజ‌రై సంద‌డి చేశారు. యుజువేంద్ర చాహ‌ల్ (Yuzvendra Chahal) ఎంతో ఉత్సాహంగా డ్యాన్స్ చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. 'ఓ రోమియో' చిత్రంలోని పాపులర్ సాంగ్ "పాన్ కీ దుకాన్" కి స్టెప్పులేసి సంద‌డి చేశారు. అంతేకాదు వ‌ధూవ‌రులిద్ద‌రికీ ప‌సుపు పూస్తూ సంద‌డి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైర‌ల్ అవుతున్నాయి. ఇక నేడు కుల్దీప్‌-వంశిక వివాహం జ‌ర‌గ‌నుంది. వివాహం అనంత‌రం ఈనెల‌ 17న ల‌క్నోలోని ఓ స్టార్ హోట‌ల్‌లో రిసెప్ష‌న్ ఏర్పాటు చేశారు. ఈ రిసెప్ష‌న్‌కు ప‌లువురు సినీ, రాజ‌కీయ‌, క్రీడా ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు.

https://x.com/rushiii_12/status/2032434400634495181

వాస్త‌వానికి కుల్దీప్ వివాహం గ‌తేడాది న‌వంబ‌ర్‌లోనే జ‌ర‌గాల్సి ఉంది. కానీ సిరీస్‌ల‌తోపాటు టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు కుల్దీప్ ఎంపిక చేయ‌డంతో పెళ్లిని వాయిదా వేయాల్సి వ‌చ్చింది. చివ‌ర‌కు నేడు వీరి వివాహం ముస్సోరిలోని ఓ రిసార్ట్‌లో అంద‌రంగ వైభ‌వంగా జ‌రుగుతోంది. వేడుకకు రెండు కుటుంబాలతో పాటు టీమిండియాకు చెందిన మాజీ, ప్రస్తుత క్రికెటర్లు కూడా హాజరయ్యారు. కుల్దీప్ యాదవ్ – వంశిక‌ ఎంగేజ్‌మెంట్ గ‌తేడాది జూన్ 4న ల‌క్నోలోని ఓ స్టార్ హోట‌ల్‌లో జ‌రిగింది. ఈ ప్రైవేట్ కార్యక్రమానికి రెండు కుటుంబాల సభ్యులు, కుల్దీప్ సన్నిహితులు, క్రికెట‌ర్ రింకు సింగ్, ఎంపీ ప్రియా స‌రోజ్ హాజ‌ర‌య్యారు.

https://x.com/JaikyYadav16/status/2032412726526713883

ఎవ‌రీ వంశిక‌..?

వంశిక చద్దా కాన్పూర్‌లోని శ్యామ్‌నగర్ లాల్‌బంగ్లా ప్రాంతానికి చెందిన యువ‌తి. ఆమె తండ్రి యోగేంద్ర సింగ్ చద్దా లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India)లో ఉద్యోగి. ప్రస్తుతం వంశిక ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తోంది. ఆమె 2017లో సెయింట్ మేరి కాన్వెంట్ హైస్కూల్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసింది. ఆ త‌ర్వాత ఉన్న‌త చ‌దువులు, ఉద్యోగం కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. కుల్దీప్, వంశిక చిన్న‌ప్ప‌టి నుంచి స్నేహితులు. ఆ స్నేహం కాస్త ప్రేమ‌గా మార‌డంతో.. కుటుంబ స‌భ్యుల అంగీకారంతో మూడుముళ్ల బంధంతో ఒక్క‌ట‌వుతున్నారు.

Also Read..

US Air Force Refueling Planes | సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిప‌ణి దాడి.. దెబ్బ‌తిన్న 5 అమెరికా రీఫ్యూయ‌లింగ్ విమానాలు

మొజ్తాబా ఖ‌మేనీ ఆచూకీ చెబితే రూ.92 కోట్లు ఇస్తాం.. భారీ రివార్డు ప్ర‌క‌టించిన అమెరికా

ఇరాన్ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై అమెరికా గురి.. ఖర్గ్ ద్వీపంపై బాంబుల వ‌ర్షం

Advertisement
Advertisement