US Air Force Refueling Planes | సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. దెబ్బతిన్న 5 అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు
US Air Force Refueling Planes | ఇరాన్‌తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సౌదీ అరేబియా (Saudi Arabia)లోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ (Prince Sultan air base)పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో అమెరికాకు చెందిన ఐదు రీఫ్యూయలింగ్ విమానాలు (Refueling Planes) దెబ్బతిన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది.
International | Published On Mar 14, 2026, 10.54 am IST
US Air Force Refueling Planes | ఇరాన్‌తో యుద్ధంలో అగ్రరాజ్యం అమెరికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే యూఎస్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇప్పుడు సౌదీ అరేబియా (Saudi Arabia)లోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్‌బేస్ (Prince Sultan air base)పై ఇరాన్ జరిపిన క్షిపణి దాడుల్లో అమెరికాకు చెందిన ఐదు రీఫ్యూయలింగ్ విమానాలు (Refueling Planes) దెబ్బతిన్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. అయితే, ఈ దాడిలో అవి పూర్తిగా ధ్వంసం కాలేదని పేర్కొంది. పాక్షికంగా మాత్రమే దెబ్బతిన్నట్లు తెలిపింది. ప్రస్తుతం వాటికి మరమ్మతులు జరుగుతున్నాయని అమెరికా అధికారులను ఉటంకిస్తూ సదరు పత్రిక వెల్లడించింది. ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని పేర్కొంది.
పశ్చిమ ఇరాక్‌లో (Iraq) గురువారం రాత్రి యూఎస్ ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఇంధనం నింపే విమానం KC-135 Tanker కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ ధృవీకరించింది. సైనిక చర్యల్లో భాగంగా రెండు కేసీ-135 ఇంధన ట్యాంకర్ విమానాలు గాలిలోకి ఎగిరాయి. వాటిలో ఒక విమానం సురక్షితంగా ల్యాండ్ కాగా.. రెండో విమానం సాంకేతిక కారణాల వల్ల పశ్చిమ ఇరాక్‌లో కుప్పకూలింది. అయితే, ఈ విమానం శత్రువుల కాల్పుల వల్ల కూలిపోలేదని పశ్చిమాసియాలో అమెరిక బలగాలకు బాధ్యతవహిస్తున్న యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) వెల్లడించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరుపుతున్నామని, మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉందని పేర్కొంది. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
ఇక, ఫిబ్రవరి 28న ఇరాన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అమెరికా ఇప్పటికే నాలుగు విమానాలను కోల్పోయింది. మూడు ఎఫ్-15ఈ యుద్ధవిమానాలు కువైట్ సైన్యం పొరపాటున జరిపిన కాల్పుల్లో కూలిపోయిన విషయం తెలిసిందే. గురువారం రాత్రి KC-135 Tanker కుప్పకూలింది. ఇప్పుడు ఐదు రీఫ్యూయలింగ్ విమానాలు దెబ్బతినడం అమెరికాకు ఎదురుదెబ్బే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read..
Kharg Island | ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గురి.. ఖర్గ్ ద్వీపంపై బాంబుల వర్షం
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

PM Modi | 21వ శతాబ్దపు అతిపెద్ద ఇంధన సంక్షోభాన్ని భారత్ విజయవంతంగా అధిగమించింది : ప్రధాని మోదీ
జులై 4, 2026

Saudi Aramco Helicopter Crash | సౌదీలో ఘోర ప్రమాదం: ‘అరామ్కో’ హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం
జూన్ 28, 2026

B-52 Bomber Crashed | కుప్పకూలిన యూఎస్ బీ-52 బాంబర్ విమానం.. 8 మంది మృతి
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
- ●woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
- ●Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..

woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..



