Mojtaba Khamenei | మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెబితే రూ.92 కోట్లు ఇస్తాం.. భారీ రివార్డు ప్రకటించిన అమెరికా
Mojtaba Khamenei | ఇరాన్ నూతన సుప్రీం లీడర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)తోపాటూ ఐఆర్‌జీసీ నేతల ఆచూకీ చెప్పిన వారికి 10 మిలియన్ డాలర్లు రివార్డుగా ఇస్తామని అమెరికా భారీ ఆఫర్ ప్రకటించింది.
International | Published On Mar 14, 2026, 10.25 am IST
Mojtaba Khamenei | ఇరాన్‌పై అమెరికా తన సైనిక చర్యలను కొనసాగిస్తోంది. ఇప్పటికే ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీని అంతం చేసిన యూఎస్.. ఇప్పుడు ఆయన కుమారుడు, నూతన సుప్రీం లీడర్ (Irans new Supreme Leader) మొజ్తాబా ఖమేనీ (Mojtaba Khamenei)ని టార్గెట్ చేసింది. ఆయనతోపాటూ ఇరాన్ శక్తిమంతమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC)కు చెందిన కీలక నేతల పనిపట్టేందుకు సిద్ధమైంది.
ఇందుకోసం భారీ ఆఫర్ ప్రకటించింది. మొజ్తాబా ఖమేనీతోపాటూ ఐఆర్‌జీసీ నేతల ఆచూకీ చెప్పిన వారికి 10 మిలియన్ డాలర్లు రివార్డుగా ఇస్తామని ప్రకటించింది. అంటే మన భారత కరెన్సీలో రూ.92,47,48,000 అన్నమాట. అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ (US State Department)కు చెందిన డిప్లొమాటిక్ సెక్యూరిటీ సర్వీస్ నిర్వహిస్తున్న 'రివార్డ్స్ ఫర్ జస్టిస్' ప్రోగ్రామ్ (Rewards for Justice programme)లో భాగంగానే ఈ రివార్డు ప్రకటించింది. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేసింది. అందులో మొజ్తాబా ఖమేనీతోపాటూ ఐఆర్‌జీసీ కీలక నేతల ఫొటోలను కూడా పంచుకుంది.
"ఈ వ్యక్తులు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లోని వివిధ విభాగాలకు నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్లాన్ చేయడం, నిర్వహించడం, అమలు చేయడంలో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది. వీరి గురించి సమాచారం తెలిస్తే.. టోర్ (Tor) ఆధారిత టిప్‌లైన్ లేదా సిగ్నల్ (Signal) ద్వారా మాకు పంపండి. సమాచారం అందించిన వారికి పునరావాసం కల్పిస్తాం. అంతేకాదు తగిన బహుమతులు కూడా అందిస్తాం" అని రివార్డ్స్ ఫర్ జస్టిస్ ప్రోగ్రామ్ తన ప్రకటనలో పేర్కొంది. యూఎస్ రిలీజ్ చేసిన ఫొటోల్లో మొజ్తాబా ఖమేనీతోపాటూ ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హెజాబీ, ఇరాన్ భద్రతా విభాగం అధిపతి అలీ లారిజానీతోపాటూ మరికొందరు ముఖ్య నేతలు ఉన్నారు.
https://x.com/RFJ_USA/status/2032482180568654025
Also Read..
ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గురి.. ఖర్గ్ ద్వీపంపై బాంబుల వర్షం
రష్యా చమురు కొనాలంటూ భారత్ సహా ప్రపంచ దేశాలను అడుక్కుంటున్న అమెరికా.. ఇరాన్ ఎద్దేవా
సంబంధిత వార్తలు

Strait of Hormuz | మరోసారి భగ్గుమన్న హర్మూజ్.. నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు
జులై 7, 2026

LPG Imports | ఇంధన భద్రతే లక్ష్యం.. అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులను పెంచే యోచనలో భారత్..!
జులై 6, 2026

Ali Khamenei Funeral | తండ్రి అంత్యక్రియలకు ఇరాన్ కొత్త ‘సుప్రీం లీడర్’ దూరం.. అసలు మోజ్తబా ఖమేనీ ఏమయ్యారు?
జులై 5, 2026
తాజావార్తలు
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
- ●woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
- ●Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..

woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..



