Kharg Island | ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై అమెరికా గురి.. ఖర్గ్ ద్వీపంపై బాంబుల వర్షం
Kharg Island | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇరాన్ చమురు ఎగుమతులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)పై అమెరికా బాంబులతో విరుచుకుపడింది.
International | Published On Mar 14, 2026, 9.58 am IST
Kharg Island | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇప్పటి వరకూ ఇరాన్ అణు కేంద్రాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న అమెరికా.. ఇప్పుడు ఏకంగా ఆ దేశ ఆర్థిక వ్యవస్థనే (Irans Crown Jewel) టార్గెట్ చేసింది. ఇరాన్ చమురు ఎగుమతులకు వ్యూహాత్మక కేంద్రంగా ఉన్న ఖర్గ్ ఐలాండ్ (Kharg Island)పై అమెరికా బాంబులతో విరుచుకుపడింది. ఈ విషయాన్ని అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) స్వయంగా తన సొంత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ ద్వారా ప్రకటించారు.
తన ఆదేశాల మేరకు యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ ఆపరేషన్‌ను నిర్వహించిందని ట్రంప్ తెలిపారు. ఇరాన్ ముడి చమురు ఎగుమతుల్లో కీలకమైన ఖర్గ్ ద్వీపంలోని సైనిక లక్ష్యాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్లు వెల్లడించారు. ఈ దాడిని మధ్యప్రాచ్య చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన బాంబు దాడుల్లో ఒకటిగా ట్రంప్ అభివర్ణించారు. అయితే, ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను మాత్రం తాను లక్ష్యంగా చేసుకోలేదని తెలిపారు.
"ప్రపంచం ఇప్పటి వరకూ చూడని అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక ఆయుధాలు మా దగ్గర ఉన్నాయి. కానీ, కొన్ని కారణాల దృష్ట్యా ఆ ద్వీపంలోని చమురు మౌలిక సదుపాయాలను నాశనం చేయకూడదని నేను నిర్ణయించుకున్నాను. అయితే, హార్మూజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి ఇరాన్ లేదా మరెవరైనా ఆటంకం కలిగిస్తే మాత్రం నా నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వస్తుంది. చమురు మౌలిక సదుపాయాలను టార్గెట్ చేసే విషయాన్ని పునఃపరిశీలిస్తా. అమెరికా లక్ష్యంగా చేసుకునే దేనినైనా కాపాడుకునే సామర్థ్యం ఇరాన్‌కు లేదు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదు. అంతేకాదు, అమెరికా, మధ్యప్రాచ్యం, ప్రంపచాన్ని బెదిరించే సామర్థ్యం టెహ్రాన్‌కు ఉండకూడదు. ఇరాన్ సైన్యం, ఆ ఉగ్రవాద పాలనతో సంబంధం ఉన్నవారంతా ఆయుధాలను వదిలేయాలి. ఆ దేశంలో మిగిలి ఉన్న కొద్దిపాటి భాగాన్నైనా కాపాడుకోవడం ఇరాన్ తెలివైన పని" అని ట్రంప్ స్పష్టం చేశారు.
కాగా, ఇరాన్ తీరానికి 25కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఖర్గ్ దీవి భారీ చమురు నిల్వలకు నిలయం. ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది అత్యంత కీలకమైన ప్రాంతం. అందుకే ఈ ఐలాండ్‌ను ఇరాన్ ఆర్థిక కిరీటంగా అభివర్ణిస్తారు. ఒక్కరోజే ఇక్కడ ఏడు మిలియన్ బ్యారెళ్ల చమురును భద్రపరచొచ్చు. ఇరాన్ క్రూడ్ ఎగుమతుల్లో ఈ దీవి వాటా 90 శాతం. యుద్ధం మొదలైనప్పటి నుంచి 13 మిలియన్ బ్యారెళ్ల చమురును ఇరాన్ ఇక్కడి నుంచే ఎగుమతి చేసింది. ఇక యుద్ధం మొదలుపెట్టి రెండు వారాలైనా ఇప్పటి వరకూ ఈ ఐలాండ్‌ను ట్రంప్ టచ్ చేయలేదు. ఇప్పుడు బాంబులతో విరుచుకపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ దాడులతో ఇరాన్ ఇంధన ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఈ ద్వీపంపై దాడులు ప్రపంచ చమురు ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు సరఫరా వ్యవస్థ దెబ్బతిని ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
Also Read..
కట్నం ఇవ్వొద్దు.. తీసుకోవద్దు.. కోలం ఆదివాసి తెగ తీర్మానం
మెటాలో 16వేల ఉద్యోగాలకు కోత..? ఏఐ ప్రభావమేనా..?
62x3= ఎంత?.. ఈ చిన్నారి ఎంత ఈజీగా సమాధానం కనుక్కుందో చూసేయండి.. వీడియో
తాజావార్తలు
- ●Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..
- ●Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..
- ●WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..
- ●woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..
- ●Vemula Prashanth Reddy | ఇప్పటికైనా మొండి పట్టు వీడండి.. కన్నెపల్లి నుంచి నీరు ఎత్తిపోసి రైతులను ఆదుకోండి: మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
- ●ITR | ఐటీఆర్‌లో కొత్త సెక్షన్.. పన్ను చెల్లింపుదారులకు కీలక మార్పు..

Moto G77 Power | 7000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో లాంచ్ అయిన మోటో జి77 పవర్ ఫోన్.. ఫీచర్లు అదిరిపోయాయి..

Congress | అర్వపల్లిలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్న ఎంపీ చామల, ఎమ్మెల్యే సామేలు వర్గీయులు..

WhatsApp | వ్యాపార సంస్థలకు గుడ్ న్యూస్.. వాట్సాప్‌లోనే మెటా బిజినెస్ ఏజెంట్.. కస్టమర్ సర్వీస్ ఇక ఈజీ..

woman delivers 4 babies | ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ఆటోలోనే డెలివరీ.. నలుగురు పిల్లలకు జననం.. కాసేపటికే..






