Yuzvendra Chahal | నిన్నటి దాకా పిచ్‌పై వికెట్ల వేట.. ఇక రాజకీయాల్లో చాహల్ కొత్త ఇన్నింగ్స్!
Yuzvendra Chahal | ఇన్నాళ్లూ క్రికెట్ మైదానంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్ పిచ్‌పై ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన ఈ స్పిన్నర్.. తాజాగా రాజకీయ పిచ్‌పై అడుగుపెట్టాడు. శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన చాహల్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.
Yuzvendra Chahal | ఇన్నాళ్లూ క్రికెట్ మైదానంలో తన స్పిన్ మాయాజాలంతో బ్యాటర్లకు చుక్కలు చూపించిన టీమిండియా స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. ఇప్పుడు పాలిటిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. క్రికెట్ పిచ్‌పై ప్రత్యర్థులను బోల్తా కొట్టించిన ఈ స్పిన్నర్.. తాజాగా రాజకీయ పిచ్‌పై అడుగుపెట్టాడు. శనివారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరిన చాహల్‌కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. ఈ మేరకు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్య ప్రకటన విడుదల చేశారు. అయితే, ఇటీవలే అమర్‌పాల్ మౌర్యతో చాహల్ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపింది. తాజాగా బీజేపీలో చేరిన అనంతరం సోషల్ మీడియా వేదికగా స్పందించిన చాహల్.. తనకు పార్టీలో స్థానం, గౌరవం కల్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అమర్‌పాల్ మౌర్యకు కృతజ్ఞతలు తెలిపాడు. బీజేపీ కుటుంబంలో తనకు అవకాశం కల్పించడం సంతోషంగా ఉందని పేర్కొన్నాడు.
ఓబీసీ మోర్చాలో భారీగా నియామకాలు..
మరోవైపు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా పలువురికి కీలక పదవులు కట్టబెట్టింది. అసోంకు చెందిన జోగెన్ మోహన్, ఒడిశాకు చెందిన మమతా మొహంతా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంగమ్‌లాల్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన బబన్‌రావు రావ్‌జీ చౌదరి, ఢిల్లీకి చెందిన సత్ ప్రకాశ్ రాణా, బిహార్‌కు చెందిన అర్జున్ సహానీ, ఉత్తరప్రదేశ్‌కు చెందిన సంగీతా బల్వంత్ బింద్‌లను జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించింది. ఢిల్లీకి చెందిన గజేంద్ర యాదవ్, కర్ణాటకకు చెందిన ప్రమోద్ మధ్వారాజ్, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లలిత్ చంద్రకర్‌లకు జాతీయ ప్రధాన కార్యదర్శుల బాధ్యతలు అప్పగించింది. అలాగే గుజరాత్‌కు చెందిన దశరథ్‌జీ ఠాకూర్, తమిళనాడుకు చెందిన టీ వరదరాజన్, జార్ఖండ్‌కు చెందిన సంజీవ్ కుమార్, హర్యానాకు చెందిన సరితా జాంగిడ్, తెలంగాణకు చెందిన కడగంచి రమేశ్, మధ్యప్రదేశ్‌కు చెందిన వైభవ్ పన్వార్, బిహార్‌కు చెందిన భీమ్ కుమార్ సాహూలను జాతీయ కార్యదర్శులుగా నియమించింది. వీరితోపాటు వివిధ రాష్ట్రాలకు చెందిన మరో 37 మందికి జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాల మేరకు ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అమర్‌పాల్ మౌర్య వెల్లడించారు.
చెస్ నుంచి క్రికెట్ వరకు.. ఇప్పుడు రాజకీయాల్లోకి..
1990లో జన్మించిన యుజ్వేంద్ర చాహల్ భారత క్రికెట్‌లో తనదైన ముద్ర వేశాడు. క్రికెట్‌లోకి రాకముందు పోటీ స్థాయి చెస్ క్రీడాకారుడిగా కూడా రాణించాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన చాహల్.. టీ20 ఫార్మాట్‌లో 400 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో 25 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టడం అతడి అత్యుత్తమ ప్రదర్శన. ఐపీఎల్‌లో ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. 2025 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ అతడిని రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్‌లో హర్యానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న చాహల్.. ఇంగ్లండ్‌లో కెంట్, నార్తాంప్టన్‌షైర్ జట్ల తరఫున కౌంటీ క్రికెట్ కూడా ఆడాడు. మైదానంలో తన బౌలింగ్‌తో బ్యాటర్లను ఇబ్బందిపెట్టిన చాహల్.. ఇప్పుడు రాజకీయాల్లోనూ కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. క్రికెట్ కెరీర్‌తో పాటు రాజకీయ ప్రస్థానం ఎలా సాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్
నవంబర్ 22, 2026

IND VS NZ | టెస్టు క్రికెట్‌లో టీమిండియా చరిత్రాత్మక రికార్డు.. 150 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఘనత!
నవంబర్ 22, 2026

Road Accident | ఒక్క కునుకు తొమ్మిది మందిని బలిగొంది..!
నవంబర్ 22, 2026
తాజావార్తలు
- ●Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్
- ●Ananda Nilayam Vimana | తిరుమల ఆనందనిలయ విమానం వెనుక ఆసక్తికర చరిత్ర..!
- ●Vikarabad | ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
- ●Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం రికార్డ్ - డైరెక్టర్‌గా మారనున్న సుకుమార్ శిష్యుడు
- ●Koleti Damodar Gupta | కేసీఆర్ దీక్ష ఫలితమే తెలంగాణ ఆవిర్భావం.. దీక్షాదివస్ బహిరంగ సభను విజయవంతం చేద్దాం: కోలేటి దామోదర్ గుప్తా
- ●US Airport | విమానం ఎక్కుతుండగా ఇద్దరు ప్రయాణికుల అరెస్ట్.. ఎయిర్‌పోర్టులో ఇమిగ్రేషన్ అధికారుల అతి!

Bandi Sanjay | బీజేపీని అడ్డుకునే దమ్ము ఆ పార్టీలకు లేదు.. రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజిన్ సర్కారే: బండి సంజయ్

Ananda Nilayam Vimana | తిరుమల ఆనందనిలయ విమానం వెనుక ఆసక్తికర చరిత్ర..!

Vikarabad | ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

Kiran Abbavaram | కిరణ్ అబ్బవరం రికార్డ్ - డైరెక్టర్‌గా మారనున్న సుకుమార్ శిష్యుడు



