YouTuber | యూట్యూబర్ కొంప ముంచిన హోమ్‌టూర్ వీడియో.. రూ.10లక్షల విలువైన ఆభరణాలు చోరీ
YouTuber | హోమ్‌టూర్ వీడియో.. ఓ యూట్యూబర్ కొంప ముంచింది. దొంగలు ఏకంగా రూ.లక్షల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) శివపురి జిల్లాలో (Shivpuri district) ఈ ఘటన చోటుచేసుకుంది.
YouTuber | కొందరు కంటెంట్ క్రియేటర్లు (YouTuber) యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్లను పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. నెటిజన్లను ఆకట్టుకునే కంటెంట్‌తో వారి ముందుకు వెళ్తుంటారు. కొందరు హోమ్ టూర్స్ (Home Tour), కిచెన్ టూర్స్, ఫ్రిడ్జ్ టూర్స్ చేస్తుంటారు. మరికొందరు ఓ అడుగు ముందుకేసి వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు, వెండి వస్తువులను వీడియో చేసి నెటిజన్లకు చూపిస్తుంటారు. అలా తన వద్ద ఉన్న బంగారం, వెండి వస్తువులను ప్రదర్శించిన యూట్యూబర్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. దొంగలు ఏకంగా రూ.లక్షల విలువైన ఆభరణాలను దోచుకెళ్లారు. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) శివపురి జిల్లాలో (Shivpuri district) ఈ ఘటన చోటుచేసుకుంది.
శివపురి జిల్లా మోహని గ్రామానికి చెందిన రచనా గుర్జర్ యూట్యూబ్ వీడియోలు చేస్తుంటుంది. ఆమె యూట్యూబ్ ఛానల్‌కి దాదాపు లక్ష మందికి పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. ఆమె తన యూట్యూబ్‌లో డైలీ లైఫ్‌ను షేర్ చేసుకుంటూ ఉంటారు. తన ఇంటిని కూడా టూర్‌లా చేసి యూట్యూబ్‌లో వీడియో పెట్టింది. అందులో ప్రధాన ద్వారం, ఎన్ని గదులు ఉంటాయి, ఎంత మంది ఉంటారనే విషయాలన్నీ వీడియో ద్వారా నెటిజన్లతో షేర్ చేసుకుంది. అంతటితో ఆగని గుర్జర్.. తన వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను ఓ టేబుల్‌పై పెట్టి ప్రదర్శించింది. వాటి గురించి పూర్తిగా వివరించింది. ఇంకేముందు ఈ బంగారం దొంగల కంట పడింది.
హోమ్‌టూర్ వీడియోలో ఇంటిని బాగా గమనించిన దుండగులు.. ఓ రోజు రాత్రి గుర్జర్ ఇంటికి దొంగతనానికి వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రిస్తున్న గది తలుపుకు తాళం వేశారు. సీసీకెమెరాల్లో కనిపించకుండా వాటి యాంగిల్స్‌ని మార్చేశారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతోపాటూ నగదును కూడా దోచుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో నిద్రలేచిన గుర్జర్ బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా డోర్ లాక్ చేసి ఉంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాకైంది. వెంటనే సమీపంలోని బంధువులకు ఫోన్ చేసింది.
ఆమె ఫోన్‌కాల్‌తో అక్కడికి వచ్చిన బంధువులు తలుపుకు వేసిన తాళాలను పగలగొట్టి వారికి బయటకు విడిపించారు. గదిలో నుంచి బయటకు వచ్చిన గుర్జర్ ఇంట్లో దొంగతనం జరిగిందని గ్రహించింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. చోరీకి గురైన బంగారం విలువ సుమారు రూ.8లక్షల నుంచి రూ.10లక్షల వరకూ ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా ప్రజలకు పోలీసులు కీలక సూచనలు చేశారు. వ్యక్తిగత వివరాలను సోషల్ మీడియాలో పెట్టొద్దని సూచిస్తున్నారు. హోమ్‌టూర్స్ వంటివి చేస్తూ ప్రమాదాలను కొని తెచ్చుకోకండి అంటూ హెచ్చరిస్తున్నారు.
Also Read..
మమతా బెనర్జీకి బిగ్ షాక్.. ఎన్డీయేకి మద్దతిస్తూ స్పీకర్‌కు లేఖ రాసిన 20 మంది టీఎంసీ ఎంపీలు
లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క
మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్
- ●US H-1B Visa Renewal Fees | H-1B, L-1 వీసా రెన్యువల్స్‌పై కొత్త ఫీజులు.. అమెరికాలో మన ఐటీ నిపుణులకు భారీ షాక్!

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!

Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?






