Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
Jeevan Reddy | సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సాగునీటికైనా, తాగునీటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ తన మనవడి కోసం మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌కి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారు.. ఆ వంద కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది.. కన్నెపల్లి దగ్గర కాఫర్ డ్యామ్ కడితే ఇప్పటికే నీళ్లు లిఫ్ట్ చేసేవాళ్లమని జీవన్ రెడ్డి తెలిపారు.
Jeevan Reddy | త్రినేత్ర.న్యూస్ : సాగునీటి ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. సాగునీటికైనా, తాగునీటికైనా కాళేశ్వరం ప్రాజెక్టే శరణ్యమని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ తన మనవడి కోసం మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్‌కి రూ. 100 కోట్లు ఖర్చు పెట్టారు.. ఆ వంద కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది.. కన్నెపల్లి దగ్గర కాఫర్ డ్యామ్ కడితే ఇప్పటికే నీళ్లు లిఫ్ట్ చేసేవాళ్లమని జీవన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ భవన్‌లో జీవన్ రెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డికి ముందు చూపు లేదు. రేవంత్ రెడ్డి ఏం చదువుకున్నారో తెలియదు. ఇంజినీర్లనే అవమాన పరుస్తున్నాడు. మంత్రులు కన్నెపల్లి దగ్గరకు వెళ్లకుండా ఎస్సారెస్పీ వెళ్లారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాధారం.. పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు బాగానే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కలలో కూడా కనిపిస్తున్నారు. ఎల్ అండ్ టీ సంస్థ మరమ్మత్తులకు ముందుకు వచ్చినా కేసీఆర్ మీద కోపంతో రేవంత్ పనులు చేయించుకోవడం లేదు. ఇప్పటికైనా మూర్ఖపు ఆలోచనలు వీడనాడండి. కన్నెపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి. కేసీఆర్ మీద ద్వేషం ఉంటే ఎన్నికల్లో చూసుకోండి. నీళ్లివ్వాలనే భాద్యతను మరచిపోకండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద మనిషిలా వ్యవహరించాలి. శ్రీరామ్ సాగర్ రివర్స్ పంపింగ్ మొదలు పెట్టారు.. వరద కాలువకు మరమ్మత్తులు చేయక పోవడం వల్ల అది ఆగిపోయిందని జీవన్ రెడ్డి తెలిపారు.
తుమ్మిడిహట్టి కట్టినా లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సిందే
ఎల్లంపల్లి దగ్గర గ్రావిటీ ద్వారా నీళ్లు తీసుకెళ్లొచ్చు అని ఓ మంత్రి అంటున్నారు. లిఫ్ట్ చేయనిది నీళ్లు గ్రావిటీ ద్వారా వెళ్లవు. తుమ్మిడిహట్టి కట్టినా లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సిందే. ఎల్లంపల్లి 2016 ఆగస్టు 4న వినియోగంలోకి వచ్చింది. ఈ రోజుకు సరిగ్గా పదేళ్లు అవుతోంది. ఆగస్టు 2008 నాడు వైఎస్ శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్ పదేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బాహుబలి మోటార్లు కేసీఆర్ ఏర్పాటు చేశారు. మిడ్ మానేరుకు నీళ్లు తరలించారు. ఇప్పుడు ఆ మోటార్లే నడుస్తున్నాయి. ఎన్డీఎస్ఏను సాకుగా చూపిస్తున్నారు. ఎల్లంపల్లి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే. ఎల్లంపల్లి 20 టీఎంసీలు.. కాళేశ్వరం 240 టీఎంసీల ప్రాజెక్టులో భాగమే. ఎల్ నినోతో దేశమంతా కరువు పరిస్థితులు ఉన్నాయ్. అల్పపీడనం వచ్చి కొన్ని వర్షాలు పడి నయమైంది. అయితే ఇంకా ఎనిమిది నెలలు సాగునీరు, తాగునీరు పూర్తి స్థాయిలో ఉండాలంటే కాళేశ్వరం ప్రాజెక్టే శరణ్యమని జీవన్ రెడ్డి అన్నారు.
తాజావార్తలు
- ●MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు
- ●GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్
- ●MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్
- ●DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?
- ●స్కాచ్ విస్కీ రచ్చ! అసలు విస్కీ వేరు... స్కాచ్ వైబ్ వేరు!
- ●Uttam Kumar Reddy | ఎల్నినో నేపథ్యంలో అప్రమత్తంగా ఉండండి

MP Vaddiraju | పార్లమెంట్ సభ్యులతో బ్యాడ్మింటన్ కోర్టులో ఎంపీ వద్దిరాజు

GST Income | జీఎస్టీ లోపాలకు ఏఐతో చెక్

MGKLIP | ఎల్లూరు, నార్లాపూర్ పంపులు వెంటనే ప్రారంభించాలి : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

DC Review | డీసీ రివ్యూ - మోడ్రన్ దేవదాసుగా లోకేష్ కనగరాజు మెప్పించాడా? - హీరోగా హిట్టు కొట్టాడా?






