Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్
Pind Daan | సాధారణంగా ఎవరైనా మరణిస్తే.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా బతికున్న భార్యకు పిండ ప్రదానం చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆ తంతును చిత్రీకరించి తన వాట్సాప్ స్టాటస్‌గా పెట్టుకోవడంతో.. అది కాస్తా వైరల్ అయింది.
Viral news | Published On Aug 4, 2026, 8.04 pm IST
Pind Daan | త్రినేత్ర.న్యూస్ : సాధారణంగా ఎవరైనా మరణిస్తే.. వారి ఆత్మకు శాంతి చేకూరాలని పిండ ప్రదానం చేస్తుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం అందుకు భిన్నంగా బతికున్న భార్యకు పిండ ప్రదానం చేశాడు. అంతటితో ఆగలేదు.. ఆ తంతును చిత్రీకరించి తన వాట్సాప్ స్టాటస్‌గా పెట్టుకోవడంతో.. అది కాస్తా వైరల్ అయింది. చివరకు భార్య తీవ్ర మనోవేదనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని లినేపార్ పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘటన వెలుగు చూసింది.
యూపీ ఫిరోజాబాద్‌కు చెందిన జితేంద్ర ప్రకాశ్‌కు, దీపా స్వర్ణాకర్‌కు 2014 ఆగస్టు 26న వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం కూడా. అయితే గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య స్వల్ప విబేధాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో తనకు ఈ భార్య వద్దని నిర్ణయించుకున్న భర్త.. బతికున్న ఆమెకు పిండప్రదానం చేశాడు.
యూపీలోని ఓ నదీ తీరం వద్దకు వెళ్లి తన భార్య ఫొటోను ముందర పెట్టుకుని పిండప్రదానం చేశాడు. ఈ తంతునంతా తన కెమెరాలో చిత్రీకరించిన భర్త జితేంద్ర.. ఆ తర్వాత స్టాటస్‌గా పెట్టుకున్నాడు. వీడియోను చూసి భార్య దీప షాకైంది. బతికుండగానే పిండ ప్రదానం చేయడంతో కన్నీరుమున్నీరుగా విలపించింది.
చేసేదేమీ లేక తనకు జరిగిన అవమానంపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిండ ప్రదానం చేయడమే కాదు.. జూలై 30న తనను ఓ గదిలో నిర్బంధించారు. అత్త, ఆడపడుచుతో పాటు తన భర్త తనను మానసికంగా వేధించారు. శారీరకంగా కూడా హింసించారు. ఆగస్టు 2న తనకు తెలియకుండా పిండప్రదానం చేశారని పోలీసుల ఎదుట ఆమె వాపోయింది.
ఇక పిండప్రదానం గురించి తన భర్తను నిలదీస్తే.. నువ్వు చనిపోయావ్.. నీతో జీవించడం నాకు ఏ మాత్రం ఇష్టం లేదు. చివరకు చంపేస్తానని కూడా బెదిరించాడని ఆమె బోరున విలపించింది. ఇందుకు సంబంధించి తన వద్ద ఆడియో రికార్డింగ్ ఆధారాలు కూడా ఉన్నాయని తెలిపింది. కేసు నమోదు చేసి, తన భర్తను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేసింది. అత్తగారింటి నుంచి తనకు రక్షణ కల్పించాలని దీప వేడుకుంది.
తాజావార్తలు
- ●Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు
- ●Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?
- ●Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన
- ●Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్
- ●Shakeela | నటి షకీలాకు సర్జరీ - స్మార్ట్‌ఫోన్‌కు బానిసగా మారి.... మెడ నరాలు దెబ్బతిని..
- ●Annavaram | సత్యమే దైవం.. అన్నవరంలో సత్యనారాయణుడి వైభవం

Hyderabad | అప్పు తీర్చలేదని.. 21 రోజుల చిన్నారిని ఎత్తుకెళ్లారు

Meta Platforms | మెటాకు భారీ నష్టం.. 1.4 ట్రిలియన్ డాలర్ల మేర ఎఫెక్ట్..?

Kangana Ranaut | బొద్దింకలు మురికి కాలువల నుంచేగా వస్తాయి.. నేనన్నదాంట్లో తప్పేముంది..? : కంగన

Indian Bank | ఇండియన్ బ్యాంకులో 700 గ్రాముల బంగారం చోరీ.. సొంతానికి వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్






