Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రాష్ట్రానికి అవసరమైన మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. యూరియా, ఎన్‌పీకే ఎరువుల నిల్వలు అవసరానికి మించి ఉన్నాయని పేర్కొంది. రాజ్యసభలో బీఆర్‌ఎస్ సభ్యుడు బీ పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఖరీఫ్-2026 సీజన్‌కు సంబంధించి రాష్ట్రానికి అవసరమైన మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. యూరియా, ఎన్‌పీకే ఎరువుల నిల్వలు అవసరానికి మించి ఉన్నాయని పేర్కొంది. రాజ్యసభలో బీఆర్‌ఎస్ సభ్యుడు బీ పార్థసారథి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ప్రతి పంట సీజన్‌కు ముందే రాష్ట్రాల వారీగా ఎరువుల అవసరాన్ని అంచనా వేసి సరఫరా ప్రణాళికను రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి నెలల వారీగా ఎరువుల అవసరాలను అంచనా వేస్తుందని, ఆ ఆధారంగా ఎరువుల శాఖ యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకే ఎరువుల సరఫరా ప్రణాళికను సిద్ధం చేస్తుందని వివరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఖరీఫ్-2026 సీజన్‌లో తెలంగాణతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకే ఎరువుల లభ్యత తగినంతగా ఉందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రాల్లో జిల్లా, మండల స్థాయిలో ఎరువుల పంపిణీ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది.
తెలంగాణ నిల్వల వివరాలు
జూలై 29 నాటికి రాష్ట్రంలో యూరియా అవసరం 7.40 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్‌ఎంటీ) కాగా, లభ్యత 8.05 ఎల్‌ఎంటీలుగా ఉంది. ఇందులో 4.49 ఎల్‌ఎంటీల విక్రయాలు జరగగా, 3.56 ఎల్‌ఎంటీల నిల్వలు మిగిలి ఉన్నాయి. డీఏపీ అవసరం 2.07 ఎల్‌ఎంటీలు కాగా, లభ్యత 2.03 ఎల్‌ఎంటీలుగా ఉందని పేర్కొంది. అవసరానికి దాదాపు సమానంగా సరఫరా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 1.72 ఎల్‌ఎంటీల డీఏపీ విక్రయాలు జరిగాయి. ఎంఓపీ ఎరువు విషయంలో రాష్ట్ర అవసరం 0.59 ఎల్‌ఎంటీలు కాగా, లభ్యత 0.56 ఎల్‌ఎంటీలుగా ఉంది. విక్రయాలు 0.16 ఎల్‌ఎంటీలు జరగ్గా.. 0.40 ఎల్‌ఎంటీల నిల్వలున్నాయి. ఎన్‌పీకే ఎరువుల విషయంలో తెలంగాణకు అవసరమైన 7.37 ఎల్‌ఎంటీలకు మించి 7.86 ఎల్‌ఎంటీల లభ్యత ఉంది. ఇప్పటివరకు 4.71 ఎల్‌ఎంటీల విక్రయాలు జరగగా, 3.13 ఎల్‌ఎంటీల నిల్వలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది.
యూరియా వినియోగంలో..
యూరియా వినియోగంలో తెలంగాణ దేశంలోని కీలక రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. రాష్ట్ర అవసరం 7.40 ఎల్‌ఎంటీలు కాగా, ఇది ఆంధ్రప్రదేశ్ (3.80 ఎల్‌ఎంటీలు), తమిళనాడు (2.80 ఎల్‌ఎంటీలు), ఒడిశా (3.11 ఎల్‌ఎంటీలు) కంటే ముందుంది. అయితే, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల కంటే తక్కువగా ఉంది. ఎన్‌పీకే ఎరువుల వినియోగంలోనూ తెలంగాణ ముందంజలో ఉంది. రాష్ట్ర అవసరం 7.37 ఎల్‌ఎంటీలుగా ఉండగా, ఆంధ్రప్రదేశ్ (2.21 ఎల్‌ఎంటీలు), తమిళనాడు (2.80 ఎల్‌ఎంటీలు), ఒడిశా (1.90 ఎల్‌ఎంటీలు) కంటే గణనీయంగా ఎక్కువగా ఉందని కేంద్ర గణాంకాలు పేర్కొంటున్నాయి.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
ఆగస్టు 6, 2026

Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
ఆగస్టు 6, 2026

ABVP Protest | హైడ్రా కమిషనర్ సంతకాన్నే ఫోర్జరీ చేశారు.. వెంటనే ఆ కళాశాలల గుర్తింపును రద్దు చేయాలి
ఆగస్టు 6, 2026
తాజావార్తలు
- ●Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ
- ●Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!
- ●Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ
- ●KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్
- ●Rakesh Reddy | 2028లో నేనే, 2033లో కూడా నేనే.. ఎంతసేపు ఇదే ధ్యాసనా రేవంత్?
- ● స్క్రీన్ వెనుక మాయాజాలం: డీప్‌ఫేక్ మూలాల్ని నరుకుతున్న ‘డిజిటల్ డిటెక్టివ్లు’

Telangana Cyber Crime Control | సైబర్ నేరగాళ్ల గుండెల్లో దడ.. కట్టడిలో దేశానికే రోల్ మోడల్‌గా తెలంగాణ

Prof Jayashankar Birth Anniversary | తెలంగాణ వచ్చినంక నాకు సంబంధాలు చూస్తావా? నవ్వులు పూయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఆన్సర్!

Telangana Jowar Farmers Payment | జొన్న రైతులకు శుభవార్త.. అకౌంట్లలో నేరుగా రూ.994 కోట్లు జమ

KTR Felicitates Journalist | జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ ఫొటో జర్నలిస్ట్.. అభినందించిన కేటీఆర్



