Bhatti Vikramarka | లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద రూ. 110 కోట్లతో అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ : భట్టి విక్రమార్క
Bhatti Vikramarka | ప్రజా ప్రభుత్వం తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరోసారి స్పష్టంగా ప్రకటించారు.
Bhatti Vikramarka | త్రినేత్ర.న్యూస్ : ప్రజా ప్రభుత్వం తెలంగాణలో సంక్షేమ రాజ్యం నిర్మించే దిశగా కృత నిశ్చయంతో పనిచేస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మరోసారి స్పష్టంగా ప్రకటించారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద రూ.110 కోట్ల అంచనాలతో నిర్మించనున్న అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్, నింబోలి అడ్డా వద్ద రూ. 25 కోట్ల అంచనాలతో నిర్మించనున్న ఎస్సీ హాస్టల్‌కు సంబంధించిన స్థల పరిశీలన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడారు.
ఈ రెండు భవనాలకు పరిపాలన అనుమతులు మంజూరు
ఇప్పటికే ఈ రెండు భవనాలకు సంబంధించి ఆర్థిక, పాలనా పరమైన అనుమతులు మంజూరయ్యాయని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ భవనాలు కేవలం భౌతికంగా కనపడే కట్టడాలు మాత్రమే కాదు.. వేలాదిమంది విద్యార్థుల విజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడే ఆధునిక దేవాలయాలని ఆయన అన్నారు.
నిరుద్యోగుల కోచింగ్ కష్టాలను శాశ్వతంగా దూరం చేస్తాం..
రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకుల కోచింగ్ కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలన్నదే ప్రజా ప్రభుత్వ బలమైన సంకల్పమని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ట్యాంక్‌బండ్ వద్ద నిర్మించ తలపెట్టిన 'డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్' స్థలాన్ని, ఆ తర్వాత కాచిగూడలోని 'నింబోలి అడ్డా హాస్టల్' ప్రాంగణాన్ని సంక్షేమ శాఖా మంత్రి లక్ష్మణ్ కుమార్, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
దళిత, నిరుపేద వర్గాల చిరకాల వాంఛ
డా. బాబాసాహెబ్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్‌ను ట్యాంక్‌బండ్ దగ్గర సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, మరో 10 అంతస్తులతో నిర్మించనున్నట్లు డిప్యూటీ సీఎం తెలిపారు. అంతేకాక నింబోలిఅడ్డా వద్ద మూడు అంతస్తులతో హాస్టల్ భవనాల నిర్మాణం దళిత, నిరుపేద వర్గాల చిరకాల వాంఛ అని చెప్పారు. ఈ భవనాల నిర్మాణం రాష్ట్రంలో జ్ఞానం పొందాలనుకునే అందరికీ ఉపయోగపడతాయని చెప్పారు.
విజ్ఞానాన్ని పంచే అత్యుత్తమ వేదికలు
నాలెడ్జ్ సెంటర్‌లో స్టడీ సర్కిల్స్, డిజిటల్ లైబ్రరీ, కాన్ఫరెన్స్ హాల్స్ లో విజ్ఞానాన్ని పంచే అత్యుత్తమ వేదికలుగా నిలుస్తాయనే ఆశాభావాన్ని డిప్యూటీ సీఎం వ్యక్తం చేశారు. పర్యటనలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మెన్ దీపక్ జాన్, ఇతర సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ●Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?

Dana Kishore | ఆగస్టు 15 నాటికి 13,046 ఫామ్ పాండ్స్ పనులు పూర్తి చేయాలి.. దాన కిషోర్ ఆదేశం

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం





