Oxygen | అంబులెన్స్‌లో తీసుకెళ్తుండగా ఆక్సిజన్ సిలిండర్ ఖాళీ.. ఊపిరాడక రోగి మృతి
Oxygen | మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) మాండ్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు.
Oxygen | త్రినేత్ర.న్యూస్: మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) మాండ్లా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ యువకుడు బలయ్యాడు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యువకుడిని అంబులెన్స్‌లో (Ambulance) హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా, మార్గ మధ్యలో ఆక్సిజన్ (Oxygen) సిలిండర్ ఖాళీ అయింది. దీంతో ఊపిరాడక ఆ వ్యక్తి తల్లిదండ్రుల ఒడిలోనే మృతిచెందాడు.
మాండ్లా (Mandla) జిల్లాలోని సున్హేరా మల్ గ్రామానికి చెందిన 21 ఏండ్ల అజీత్ బరియా కిడ్నీ సంబంధిత (Kidney Patient) వ్యాధితో బాధపడుతున్నాడు. జూలై 27న అతని పరిస్థితి విషమించడంతో అతని తండ్రి 108 అంబులెన్స్‌కు (Govt Ambulance) ఫోన్ చేశారు. దీంతో గంట తర్వాత వచ్చిన అంబులెన్స్‌లో బమ్హాలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. ఈ క్రమంలో అతడు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నప్పటికీ అంబులెన్స్ సిబ్బంది అతనికి ఆక్సిజన్ పెట్టేందుకు నిరాకరించారు. అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్యులు జిల్లా దవాఖానకు తరలించాలని సూచించారు. దీంతో అదే అంబులెన్స్‌లో ఆక్సిజన్ సహాయంతో హాస్పిటల్‌కు తీసుకెళ్తున్నారు. మార్గమధ్యలో ఆక్సిజన్ సిలిండర్ అయిపోయింది. దీంతో ఊపిరి ఆడక తల్లడిల్లిన ఆ యువకుడు తండ్రి ఒడిలోనే ప్రాణాలు వదిలాడు. ఈ సందర్భంగా తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
కాగా, అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ కుమారుడు చనిపోయాడని అతని తండ్రి అమన్ బరియా ఆరోపిస్తున్నారు. తాను ఫోన్ చేసిన గంట తర్వాత అంబులెన్స్ వచ్చిందని, అందులో తొలుత ఆక్సిజన్ పెట్టేందుకు సిబ్బంది నిరాకరించారన్నారు. వైద్యుల సూచనతో ఆక్సిజన్ అందించినప్పటికీ అది.. మండల కేంద్రం నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా దవాఖానకు వెళ్లకముందే అయిపోయిందని చెప్పారు. తన కుమారుడు తన ఒడిలోనే చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు.
Mandla,Madhya Pradesh - A 21-year-old kidney patient died in his parents’ arms after the oxygen supply allegedly ran out in a government 108 ambulance while he was being taken to hospital, sparking serious allegations of negligence against the emergency medical service, a… pic.twitter.com/5ia4c6m2rI
— NextMinute News (@nextminutenews7) July 31, 2026
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Karimnagar | చనిపోయాడనుకున్న వ్యక్తి లేచి కూర్చుకున్నాడు..
సెప్టెంబర్ 27, 2026

Garba | మీ అక్కాచెల్లెళ్లను తీసుకురండి.. గర్భా వేడుకలపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
సెప్టెంబర్ 22, 2026

Cheetah | విజయవంతంగా ప్రాజెక్టు చీతా.. 71 ఏండ్ల తర్వాత భారత గడ్డపై చీతాల సందడి
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?
- ●Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!
- ●Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ
- ●Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?
- ●OnePlus Festive Sale | వన్‌ప్లస్ ఫెస్టివ్ సేల్.. రూ.14,999కే 5జి ఫోన్..
- ●Navaratri Brahmotsavam | తిరుమలకు మరోసారి బ్రహ్మోత్సవ శోభ.. నవరాత్రి ఉత్సవాల షెడ్యూల్ ఇదే

Chirumalla Rakhesh Kumar | ఓయూకు వెయ్యి కోట్లు, ఐలమ్మ యూనివర్సిటీకి ఇస్తామన్న 500 కోట్లు ఏవీ?

Aman Sehrawat | అమన్ పసిడిపట్టు..! ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన సెహ్రావత్..!

Bathukamma | అక్టోబర్ 18న ట్యాంక్‌బండ్‌పై సద్దుల బతుకమ్మ

Harish Rao | కళ్లెదుట నీళ్లున్నా కాలం తెచ్చిన కరువెట్లయితది?



