Minister Sridhar Babu | మునిగిపోయే కారుకు పది సీట్లు రావు.. హరీశ్‌రావుకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్
Minister Sridhar Babu | బీఆర్ఎస్ లీడర్లు తలకిందులుగా తపస్సు చేసినా.. మునిగిపోయే కారుకు 10 సీట్లు కూడా రావని.. వంద సీట్లు అనే పగటి కలలు మానాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చురకలంటించారు. రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్‌పై ప్రజలు విసిగిపోయారనడం భ్రమేనన్నారు.
Minister Sridhar Babu | బీఆర్ఎస్ లీడర్లు తలకిందులుగా తపస్సు చేసినా.. మునిగిపోయే కారుకు 10 సీట్లు కూడా రావని.. వంద సీట్లు అనే పగటి కలలు మానాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చురకలంటించారు. రెండున్నరేళ్లలోనే కాంగ్రెస్‌పై ప్రజలు విసిగిపోయారనడం భ్రమేనన్నారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. పెద్దపల్లి పర్యటనలో మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. రెండున్నరేళ్ల మా ప్రజాపాలన చూసి మీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, పదేళ్ల మీ అహంకారానికి ప్రజలు ఆల్రెడీ ప్రతిపక్షంలో కూర్చోబెట్టారని విమర్శించారు. అసెంబ్లీ, లోక్ సభ, గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టిన సంగతి అప్పుడే మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.
హాస్యాస్పదం.. దుర్మార్గం..
పెద్దపల్లి జిల్లాలో భూముల ధరలు తగ్గాయని హరీశ్ రావు విమర్శించడం హాస్యాస్పదం, దుర్మార్గమన్నారు. పదేళ్ల మీ పాలనలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ల్యాండ్ మాఫియా కలిసి కృత్రిమంగా రేట్లు పెంచారని ఆరోపించారు. పెద్దపల్లిలో సామాన్యుడు గజం భూమి కొనాలన్నా, సొంత ఇల్లు కట్టుకోవాలన్నా భయపడే పరిస్థితి తెచ్చింది వాస్తవం కాదా హరీశ్‌రావు అంటూ నిలదీశారు. పోలీసులను ప్రగతి భవన్ కాపలాదారులుగా మార్చి.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది మీ కేసీఆర్ కాదా? అన్నారు. మీ హయాంలో ఫ్రెండ్లీ పోలీస్ అంటే.. మీకు, మీ బంధువులకు మాత్రమే. సామాన్య ప్రజలకు కాదన్నారు. తమ ప్రభుత్వం పోలీసుల హక్కులకు, వారి సంక్షేమానికి సంపూర్ణంగా కట్టుబడి ఉందన్నారు. జీతాల కోత, అలవెన్సుల రద్దు అనేవి బీఆర్ఎస్ ఐటీ సెల్ సృష్టించిన అభూతకల్పనలు మాత్రమేనని స్పష్టం చేశారు.
అలాంటి వ్యాఖ్యలు హరీశ్‌రావుకు తగవు..
శాంతిభద్రతలను కాపాడే పోలీసుల సంక్షేమానికి, వారి హక్కులకు మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రచారాలు చేస్తూ, సమాజంలో విద్వేషాలు రేకెత్తించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటే.. దాన్ని కక్షపూరితం అనడం ఎంతవరకు సమంజసమన్నారు. పెద్దపల్లి జిల్లాలో నిన్న జరిగిన పార్టీ సమావేశంలో ప్రభుత్వ, పోలీస్ అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ మేం అధికారంలోకొచ్చాకా ‘బుద్ధి చెబుతాం’ అని బహిరంగంగా హెచ్చరించడం ఒక మాజీ మంత్రిగా హరీశ్‌రావుకు తగదన్నారు. చట్టానికి లోబడి బాధ్యతాయుతంగా పనిచేసే ప్రతి అధికారికి తమ ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందన్నారు. ఎవరో చేసే తాటాకు చప్పుళ్లకు భయపడొద్దని ప్రతి అధికారికి సూచిస్తున్నామని శ్రీధర్‌బాబు తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం
- ●TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!
- ●Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
- ●Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!
- ●Thanuja Puttaswamy | బిగ్‌బాస్ తనూజ తెలుగు వెబ్‌సిరీస్ టైటిల్ ఇదే - స్ట్రీమింగ్ ఎందులో ...ఎప్పుడంటే?
- ●Pind Daan | బతికున్న భార్యకు పిండ ప్రదానం.. ఆపై వాట్సప్ స్టాటస్

Garima Agrawal | జిల్లాలో జలసిరి పనులు ముమ్మరం చేయాలి.. కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశం

TGIIC Land Auction 2026 | ఎకరం కనీస ధర రూ.175 కోట్లు.. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో TGIIC భారీ ఈ-వేలం!

Fertilizer | తెలంగాణలో ఎరువుల కొరత లేదు.. వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

Jeevan Reddy | రేవంతూ.. ఆ 100 కోట్లు ఖర్చు పెడితే కాఫర్ డ్యామ్ పూర్తయ్యేది..!




