Snake bites | రెండు నిమిషాల్లో ఐదుసార్లు కాటేసిన పాము.. మహిళను కాపాడిన 35 ఇంజక్షన్లు
Snake bites | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నర్మదాపురం (Narmadapuram) జిల్లాలో ఓ మహిళను కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఐదుసార్లు పాము కాటేసింది (Snake bites).
Snake bites | త్రినేత్ర.న్యూస్ : మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నర్మదాపురం (Narmadapuram) జిల్లాలో ఓ మహిళను కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఐదుసార్లు పాము కాటేసింది (Snake bites). దాదాపు 24 గంటలు శ్రమించి వైద్యులు సదరు మహిళను కాపాడారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..? నర్మదాపురం జిల్లా జీల్ పిప్రియా (Jheel Pipariya) గ్రామానికి చెందిన రాధాబాయి అహిర్వార్ (Radhabai Ahirwar) జూలై 13వ తేదీన మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కిచెన్ శుభ్రం చేస్తోంది. ఆ సమయంలో అల్మారాలో దాక్కున ఐదు అడుగుల నల్లటి పాము రాధాబాయి చేయిపై కాటేసింది. దాన్నుంచి తప్పించుకునేందుకు ఆమె చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆ పాము రెండు నిమిషాల వ్యవధిలోనే ఏకంగా ఐదుసార్లు కుడి అరచేతిపై కాటేసింది.
కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఓ నాటు వైద్యం కేంద్రానికి తీసుకెళ్లారు. అయితే, ఫలితం లేకపోవడంతో చివరికి పిప్రియా సివిల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే విషం మహిళ శరీరంలోకి ఎక్కేయడంతో పరిస్థితి విషమించింది. వైద్యులు దాదాపు 24 గంటలపాటూ శ్రమించి ఆమెకు మొత్తం 35 యాంటీ స్నేక్ వెనమ్ (Anti-Snake Venom) ఇంజెక్షన్లు అందించారు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది.
సమయానికి ఆసుపత్రికి తీసుకొచ్చి ఉండి ఉంటే ఇంత శ్రమపడాల్సిన అవసరం ఉండేది కాదని వైద్యులు తెలిపారు. అందుకే పాము కాట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పాము కాటుకు గురైన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. నాటు వైద్యులు, మంత్రసానుల వద్దకు వెళ్లి సమయం వృథా చేసుకోవద్దని సూచించారు.
Also Read..
ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలపై దశలవారీ పోరాటం
స్టాక్ మార్కెట్‌లకు బ్రేక్.. 4 రోజుల ర్యాలీకి తెర, ఆర్‌బీఐ నిర్ణయంపై ఉత్కంఠ..
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..
- ●KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు
- ●Shivcharan Gupta Sonipat | కోట్లు సంపాదించిన తండ్రికి చివరికి మిగిలింది రూ.5100.. వీడియో కాల్లో అంత్యక్రియలు
- ●Mallikarjun Kharge | విద్యార్థులపై పోలీసుల చర్య.. సభలో ప్రకటన చేయడానికి అమిత్‌షాకు ఏం అడ్డంకులు ఉన్నాయ్..?
- ●Khammam | గోపాలపురం పాఠశాల గదుల నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు

Rukmini Vasanth | రామ్‌చరణ్ సరసన రుక్మిణి వసంత్..

Stock Markets | స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి.. స్వల్ప లాభాల్లో ముగిసిన సూచీలు..

KTR | మూడు తరాలను ముంచిందే కాంగ్రెస్సని సార్ చెప్పేవారు.. అందుకే ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలనేవారు

Shivcharan Gupta Sonipat | కోట్లు సంపాదించిన తండ్రికి చివరికి మిగిలింది రూ.5100.. వీడియో కాల్లో అంత్యక్రియలు






